US President Donald Trump | వివిధ దేశాలలో ఉండి కేసులో చిక్కుకున్న వారిని తిరిగి వారి సొంత దేశాలకు పంపించాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ఫోన్ టాపింగ్ కేసు వేగవంతం అవుతుందని భావిస్తున్నారు. ఇదే కనుక జరిగితే ఇప్పటికే ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్ లను భారత్‌కు రప్పించి సమాధానాలు రాబట్టాలని చూస్తున్న జూబ్లీహిల్స్ పోలీసులకు ట్రంప్ నిర్ణయంతో పని తేలిక కానుంది. నిందితులు భారత్‌కు తిరిగి వచ్చిన వెంటనే అరెస్టు చేసి విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.


అధికార దుర్వినియోగానికి పాల్పడితే అంతే మరి...


గత బిఆర్ఎస్ నేతలు చెప్పారని జడ్జిల నుండి నేతల వరకు అందరి ఫోన్ లను ట్యాప్ చేస్తూ కొందరు అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఫోన్ టాపింగ్ కేసులో అరెస్ట్ అయిన ఎస్పి తిరుపతన్నకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కేసు విచారణలో ఇంకెన్నాళ్లు జాప్యం  చేస్తారంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయితే కేసుకు సంబంధించిన పూర్తి విచారణ జరగడానికి ఇంకా నాలుగు నెలల సమయం పడుతుందని అత్యున్నత న్యాయస్థానానికి ప్రభుత్వం నివేదిక పంపింది. దీంతో ఈ కేసులో సంబంధం ఉండి మొదట అరెస్టు అయిన తిరుపతన్నకు సుప్రీంకోర్టులో కండిషనల్ లభించింది.


2023 డిసెంబర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే కేసుకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేసినట్టు అభియోగాలు నమోదు చేశారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అధికారులుగా పనిచేసిన భుజంగరావు, ప్రణీత్ రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డిసీపీ రాధాకిషన్ రావు ఇంకా జైల్లోనే ఉన్నారు. వీరికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున ఛార్జ్ సీట్లు చేస్తున్నారు. న్యాయస్థానం మాత్రం ఛార్జ్ సీట్లు వేసినంత మాత్రాన నిందితులు జైల్లో ఉండే అవసరం లేదంటూ తిరుపతన్నకు మాత్రం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఊరట కల్పించింది. సాక్షులను ప్రభావితం చేయకూడదు, సాక్ష్యాలను ధ్వసం చేస్తే బెయిల్ రద్దుకు    రావచ్చని పేర్కొంది.


ఫోన్ టాపింగ్ జరిగిందంటూ బాధితుల ఫిర్యాదులు...


ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ బాధితుల నుంచి రాతపూర్వకంగా స్టేట్మెంట్లను పోలీసులు సేకరిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలతో పాటు కాంగ్రెస్ నాయకుల కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాపింగ్‌కు గురైనట్లు ఆరోపణలున్నాయి. ప్రత్యేకించి మంత్రులుగా పనిచేసిన పలువురు రాజకీయ నాయకులు ఫోన్ ట్యాపింగ్‌కు గురయ్యారని.. ఇంతకీ ఏ విషయాలు సేకరించారనేది దర్యాప్తులో తేలనుంది.