KCR Kondagattu Old Pic : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొండ గట్టు పర్యటనకు వెళ్లారు. స్వామి వారిని దర్శించుకున్నారు. కొండ గట్టును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు రూ. వంద కోట్ల నిధులు కూడా కేటాయించారు. ఇప్పుడు కేసీఆర్ పర్యటన అంతా హడావుడిగా సాగుతోంది. ఆయన కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. కానీ ఒకప్పుడు కేసీఆర్ సామాన్యునిలా కుటుంబంతో కొండగట్టుకు వెళ్లారు. స్వామి వారిని దర్శించుకున్నారు. తర్వాత ఫోటోలు కూడా దిగారు. ఆ ఫోటోలను ట్విట్టర్‌లో ఎంపీ సంతోష్ కుమార్ పోస్ట్ చేశారు.
కేసీఆర్ తో పాటు కవిత, కేటీఆర్ కూడా ఫోటోల్లో ఉన్నారు. ఇతర బంధువులతో కలిసి కొండగట్టుకు వెళ్లిన సమయంలో దేవుడి దర్శనం చేసుకుని కొండపపై పిల్లలతో కేసీఆర్ సరాదా గడిపారు. అప్పట్లో ఎలాంటి హంగామా లేకుండా ఇలా స్వామి వారిని దర్శించుకోవడం
కేసీఆర్ కుటుంబంతో సహా ఫోటోలు దిగిన ప్రాంతాన్ని వ్యూ పాయింట్‌గా పిలుస్తారు. అయితే అప్పట్లో ఎలాంటి అభివద్ధి లేకుండా కేవలం కొండ రాళ్లుగానే ఉంది. ఆ తర్వాత కూడా పెద్దగా అభివృద్ధి చెందలేదు. ఇప్పుడు ఆ వ్యూపాయింట్ ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు సీఎం కేసీఆర్‌కు సమీప బంధువు. కేసీఆర్ సోదరి కుమారుడు అయిన సంతోష్ రావు ఎక్కువగా కేటీఆర్, కవితలతోనే కలిసి పెరిగారు. అందుకే పాత ఫోటోలను ఆయన తరచూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇవి సోషల్ మీడియాలో తరచూా వైరల్ అవుతూ ఉంటాయి.
కొండగట్టు అంజన్న సన్నిధిలో కేసీఆర్, ఆలయ మాస్టర్ ప్లాన్‌పై సమీక్ష