Congress : తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థల ఎంపికలో తీరిక లేకుండా ఉంటున్నాయి. కాంగ్రెస్ నుంచి మొదటి జాబితా విడులైంది. రెండో జాబిా కోసం ఆశావహులు ఎదురు చూస్తున్నారు.  కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ అభ్యర్థుల జాబితాపై శనివారం మరోసారి కసరత్తు చేస్తోంది.  కేసీ వేణుగోపాల్ తో స్క్రీనింగ్ కమిటీ సభ్యులు భేటీ అయ్యారు.  వామపక్షాలకు చెరో 2 సీట్లపై ఇప్పటికే అవగాహన కుదిరినట్లు సమాచారం. సిపిఎంకు ఇచ్చే సీట్ల వ్యవహారం ఇంకా పూర్తి కాలేదని కాంగ్రెస్ నేతలు తెలిపారు.  వివాదం లేని సీట్లపై కాంగ్రెస్ నాయకులు చర్చించనున్నారు. ఎన్నికల కమిటీ ఆమోదం తర్వాత రెండో జాబితా విడుదల ఉంటుందని నేతలు చెబుతున్నారు. 


టిక్కెట్ ఆఫర్ తో కాంగ్రెస్‌తో చేరిన వారికి  చాన్స్             


కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరేవారికి తుది జాబితాలో చోటు కల్పించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాహుల్ గాంధీ నేతృత్వంలో బండి రమేష్‌, ఎమ్మెల్యే రేఖానాయక్‌, నారాయణ్‌రావు పటేల్ , మాజీ ఎమ్మెల్యే ప్రతాప్​రెడ్డి తదితరులు కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. పలు నియోజకవర్గాలకు బలమైన నాయకులు పార్టీకి దొరికినట్లు కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.  కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ సమావేశంతో ఒకట్రెండు రోజుల్లో కాంగ్రెస్ రెండో జాబితా విడుదల కానుందని చెబుతున్నారు. 


పలు నియోజకవర్గాల్లో  అభ్యర్థులపై ఏకాభిప్రాయం        


కామారెడ్డి-షబ్బీర్‌ అలీ, భువనగిరి- కుంభం అనిల్‌కుమార్‌ రెడ్డి, వరంగల్ తూర్పు- కొండా సురేఖ, జనగాం- కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, పాలేరు- పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, ఖమ్మం- తుమ్మల నాగేశ్వరరావు, ఇల్లందు- కోరం కనకయ్య, జడ్చర్ల- అనిరుధ్ రెడ్డి, మహబూబ్​నగర్- యెన్నం శ్రీనివాస్​రెడ్డి, వనపర్తి- చిన్నారెడ్డి, నారాయణపేట- ఎర్రశేఖర్,‌ మహేశ్వరం- పారిజాత నర్సింహారెడ్డి, చార్మినార్‌- అలీ మస్కతీ, కంటోన్మెంట్‌- పిడమర్తి రవి పేర్లు ఉన్నట్లుగా చెబుతున్నారు. శేరిలింగంపల్లి నుంచి  జగదీశ్వర్ గౌడ్, కూకట్ పల్లి నుంచి బండి రమేష్ పేర్లను కూడా ఖరారు చేసే అవకాశం ఉంది.  కంటోన్మెంట్ కు గద్దర్ కుమార్తె కూడా పోటీ పడుతున్నారు. 


పోటీ ఎక్కవగా ఉన్న నియోజకవర్గాలపై చర్చలు               


కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ నేతల నుంచిపోటీ ఎక్కువగా ఉంది.  దేవరకద్ర నుంచి మధుసూదన్‌ రెడ్డి, కాటం ప్రదీప్‌ గౌడ్‌. మక్తల్‌ నుంచి శ్రీహరిముదిరాజ్‌, కొత్త సిద్ధార్థరెడ్డి. దేవరకొండ నుంచి వడ్త్యారమేష్‌ నాయక్‌, బాలునాయక్‌లు. సూర్యాపేట నుంచి పటేల్‌ రమేష్ రెడ్డి, దామోదర్‌ రెడ్డి మునుగోడు నుంచి చలమల కృష్ణారెడ్డి, పాల్వాయి స్రవంతి. తుంగతుర్తి నుంచి అద్దంకి దయాకర్‌, ప్రీతంలు టికెట్లు ఆశిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి కూడా కొంత మంది ప్రతిపాదనలు పంపుతున్నారు. పటాన్ చెరు నుంచి  కాట శ్రీనివాస్ గౌడ్ ఉండగా..  బీఆర్ఎస్‌లో టిక్కెట్ దక్కని ముదిరాజ్ నేత  నీలం మధులు టికెట్‌ ఇస్తే పార్టీలో చేరుతామంటున్నారు. ఇంకా  ప్రకటించాల్సిన 64 నియోజకవర్గాల్లో  కనీసం యాభై సీట్లలో రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు.