Nizam Collage Hyderabad: హైదరాబాద్‌లో నిజాం కాలేజీ (Nizam Collage) విద్యార్థులు నిరసనలు చేశారు. కాలేజీలో కట్టిన బాలికల హాస్టల్ ను కేవలం పీజీ చదువుతున్న వారికి కేటాయించడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు యాజమాన్యం నిర్ణయాన్ని నిరసిస్తూ ధర్నా చేశారు. హాస్టల్ వసతిని అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థినులకు కూడా కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నిజాం కాలేజీ (Nizam Collage) ప్రిన్సిపాల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన విద్యార్థులు రోడ్డుపై కూర్చొని ఆందోళన తెలిపారు. 


దూర ప్రాంతాల నుంచి వచ్చి చదువుకుంటున్న విద్యార్థినులు హాస్టల్ సదుపాయం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రోడ్డుపైనే విద్యార్థినులు కూర్చొని నిరసన చేయడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే, విద్యార్థుల ఆందోళన గురించి తెలుసుకున్న ప్రిన్సిపాల్ వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థినులకు కూడా హాస్టల్ వసతి కల్పించాలని విద్యార్థులు వినతి పత్రం ఇవ్వాలని, తర్వాత దానిపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే విద్యార్థులు అందుకు ఒప్పుకోలేదు. ప్రిన్సిపాల్ తక్షణమే నిర్ణయం ప్రకటించాలని స్టూడెంట్స్ భీష్మించుకొని కూర్చున్నారు. ఇక చేసేది లేక ఆందోళన చేస్తున్న విద్యార్థినులను పోలీసులు అరెస్ట్ చేసేందుకు రావడంతో అక్కడ కాసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది.


Also Read: Chodavaram News : విద్యార్థి భేరిలో వైసీపీ నేతలకు వింత అనుభవం, సీఎం పవర్ స్టార్ అంటూ నినాదాలు!


చేనేత వస్తువులపై జీఎస్టీ రద్దుకు నిరసన


మరోవైపు, చేనేత వస్తువులపై ఐదు శాతం జీఎస్టీని ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ చేనేత పరిశ్రమ కార్మికులు (Weavers News) భారీ నిరసన చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా చేనేత పైన జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లుగా వారు తెలిపారు. వెంటనే జీరో శాతం జీఎస్టీని అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రమణ కూడా పాల్గొన్నారు. చేనేత కార్మికులు (Weavers News) రాసిన లక్షలాది పోస్ట్ కార్డులను ఆబిడ్స్ జనరల్ పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేయనున్నారు. నిజాం కాలేజ్ గ్రౌండ్స్ నుండి జరిగే ర్యాలీ ఈ కార్యక్రమం ద్వారా హ్యాండ్లూమ్ పవర్లూమ్ కార్పొరేషన్ చైర్మన్లు, నేతన్నలకు మద్దతు తెలిపినట్లుగా ప్రకటించారు.


నిజాం కాలేజీ గ్రౌండ్స్ (Nizam Collage Grounds) నుంచి జనరల్ పోస్ట్ ఆఫీస్ (Abids General Post Office) వరకు నేతన్నలతో (Weavers News) ర్యాలీ చేపట్టాం. కేంద్రం ఐదు శాతం జీఎస్టీని అమలు చేయడం వల్ల చేనేత కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారు. వారసత్వంగా వచ్చే చేనేత వృత్తిపై కేంద్రం జీఎస్టీని (GST) అమలు చేయడం దారుణం. చేనేత పరిశ్రమలపై ఐదు శాతం జీఎస్టీని ఎత్తివేసే వరకు కేంద్ర వైఖరికి నిరసనగా పోరాడుతాం. అబిడ్స్ పోస్ట్ ఆఫీస్ (Abids Post Office) లో పోస్ట్ కార్డులు చేనేత కార్మికులుగా మేమంతా ప్రధానమంత్రి మోదీకి పంపుతున్నాము. వెంటనే ఐదు శాతం జీఎస్టీని చేనేత వస్తువులపై రద్దు చేయాలి.