Weather Updates In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఓ వైపు మధ్యాహ్నం పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నా, మరోవైపు రాత్రి వేళల్లో చలి గాలుల ప్రభావం అధికంగా ఉందని అమరావతి, భారత వాతావరణ కేంద్రం పేర్కొన్నాయి. మధ్యాహ్నం ఉక్కపోత వాతావరణం ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరో రెండు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.
ఉత్తర కోస్తాంధ్ర యానాంలో..
ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుంది. ఆగ్నేయ దిశ నుంచి బలమైన గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మరో రెండు రోజులు వాతావరణం వేడిగా మారుతుంది. పగటి పూట ఎండ ఎక్కువగా ఉండటంతో వాతావరణంలో ఉక్కపోత అధికం అవుతుంది. బాపట్లలో 34 డిగ్రీలు, కాకినాడలో 34.7 డిగ్రీలు, కళింగపట్నంలో 20.2 డిగ్రీలు, నందిగామలో 21.2 డిగ్రీలు, నెల్లూరులో 24.6 డిగ్రీలు, తునిలో 33.8 డిగ్రీలు, విశాఖపట్నంలో 35.6 డిగ్రీలు, అమరావతిలో 36.2 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. మరో రెండు రోజుల్లో ఒకట్రెండు చోట్ల పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలు నమోదు అవుతుందని తెలిపారు.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ..
రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో పగటి పూట వేడి అధికం అవుతుంటే, రాత్రిపూట చలి గాలుల ప్రభావం అధికంగా ఉంది. దీంతో రాత్రివేళ కనిష్ట ఉష్ణోగ్రతలు 20కి దిగువన నమోదవుతున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వేడి, ఉక్కపోత అధికం అవుతుంది. పగటి పూట 37 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నా, రాత్రి వేళ అనంతపురంలో 18.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆరోగ్యవరంలో 17.5 డిగ్రీలు, తిరుపతిలో 18.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది.
తెలంగాణ వెదర్ అప్‌డేట్.. (Temperature in Telangana)
రాష్ట్రంలోనూ ఎండలు మండిపోతున్నాయి. రోజుకు 1 డిగ్రీ చొప్పున ఉష్ణోగ్రత అధికం అవుతుంది. ముఖ్యంగా తూర్పు తెలంగాణ జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, సూర్యాపేట, ఖమ్మంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం పొడిగా మారుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. మార్చి 13 నుంచి వడగాల్పులు వీచి, పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగ్నేయ దిశ నుంచి గంటలకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
Also Read: Gold Rate Today: పసిడి ప్రియులకు ఊరట - నేడు బంగారం ధరలకు బ్రేక్, మరోవైపు కొండెక్కిన వెండి రేట్లు
Also Read: iPhone 12 Offer: ఐఫోన్ 12పై అమెజాన్‌లో బంపర్ ఆఫర్ - ఏకంగా రూ.12 వేలు తగ్గింపు!