ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఐఫోన్ 12పై భారీ ఆఫర్‌ను అందించారు. ఈ ఫోన్ అసలు ధర రూ.65,900 కాగా... ప్రస్తుతం రూ.53,999కే అందుబాటులో ఉంది. అంటే సుమారు రూ.12 వేల వరకు తగ్గింపు లభించిందన్న మాట. అంతేకాకుండా హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,000 అదనపు తగ్గింపు అందించనున్నారు.
ప్రొడక్ట్ రెడ్, బ్లాక్, బ్లూ, గ్రీన్, పర్పుల్, వైట్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. అయితే వీటిలో బ్లూ కలర్ వేరియంట్ ధర మాత్రమే రూ.53,999కు తగ్గింది. మిగతా కలర్ వేరియంట్ల ధర కొంచెం ఎక్కువగానే ఉంది. ఇందులో 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.59,999గానూ, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.68,999గానూ నిర్ణయించారు. హెచ్‌డీఎఫ్‌సీ ఆఫర్ వీటిపై కూడా అందుబాటులోనే ఉంది.
ఐఫోన్ 12 స్పెసిఫికేషన్లు
ఐఫోన్ 12లో యాపిల్ ఏ14 బయోనిక్ చిప్ ప్రాసెసర్‌ను అందించారు. ఇందులో సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను యాపిల్ అందించింది. యాపిల్ సెరామిక్ షీల్డ్ గ్లాస్‌ను కూడా ఇందులో అందించారు. ఇందులో 6.1 అంగుళాల స్క్రీన్‌ను అందించారు. ఈ ఫోన్‌తో పాటు చార్జర్‌ను యాపిల్ అందించడం లేదు. దాన్ని మీరు ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 12 మెగాపిక్సెల్ కాగా.. దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఇందులో ఉన్నాయి.
Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?
Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?