CBSE Term 2 Exams Schedule: సీబీఎస్ఈ 10, 12 తరగతులకు సంబంధించిన డేట్ షీట్(టైం టేబుల్) శుక్రవారం సీబీఎస్ఈ బోర్డు విడుదల చేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10, 12వ తరగతులకు ఏప్రిల్-మే నెలలో టర్మ్ 2 పరీక్షలను నిర్వహిస్తోంది. 2021-2022 విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్ఈ పరీక్షలను రెండు టర్మ్ ల్లో నిర్వహిస్తుంది. చాలా రాష్ట్రాల విద్యా బోర్డులు కూడా అదే నిర్ణయాన్ని అమలు చేస్తున్నాయి.
సీబీఎస్ఈ టర్మ్-2 పరీక్ష తేదీలు:
10వ తరగతికి ఏప్రిల్ 26 నుంతి మే 24 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. సీబీఎస్ఈ 10, 12వ తరగతులకు డేటా షీట్ అధికారిక వెబ్‌సైట్ cbse.gov.in , cbsecademic.nic.inలో విడుదల చేసింది. సీబీఎస్ఈ అడ్మిట్ కార్డులను అభ్యర్థుల సంబంధిత పాఠశాలల నుండి తీసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 26 నుంచి థియరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు సీబీఎస్ బోర్డు ఇప్పటికే ప్రకటించింది. ఈ పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను శుక్రవారం ప్రకటించింది. ఈ పరీక్షలను ఆఫ్‌లైన్ మోడ్‌లోనే నిర్వహించనున్నట్టు బోర్డు గత నెలలోనే ప్రకటించింది. పరీక్షల నిర్వహణపై రాష్ట్రాలతో చర్చించిన తర్వాత దేశంలోని కోవిడ్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని టర్మ్-2 పరీక్షలను ఆఫ్‌లైన్ మోడ్‌లో నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. సీబీఎస్‌ఈ బోర్డు వెబ్‌సైట్‌లో శాంపిల్ క్వశ్చన్ పేపర్ల మాదిరిగానే పరీక్షల ప్రశ్నాపత్రం ఉంచనుంది. కరోనా కారణంగా ఈ విద్యా సంవత్సరం రెండు విడతలుగా పరీక్షలు నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. అయితే ఇప్పటికే టర్మ్-1 పరీక్షలు పూర్తి నిర్వహించింది. 10, 12వ తరగతుల విద్యార్థులకు ఏప్రిల్ 26 నుంచి పరీక్షలు మొదలవుతాయి. కరోనా కారణంగా స్కూళ్లు మూసివేతను దృష్టిలో ఉంచుకుని రెండు పరీక్షల మధ్య తగిన వ్యవధి ఇచ్చామని బోర్డు తెలిపింది. డేట్ షీట్‌ను జేఈఈ మెయిన్ సహా ఇతర పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్టు సీబీఎస్ఈ బోర్డు వెల్లడించింది.
సీబీఎస్ఈ 10వ తరగతి టర్మ్-2 పరీక్షల షెడ్యూల్ :
- ఇంగ్లీష్ లాంగ్వేజ్, సాహిత్యం: ఏప్రిల్ 27
- గణితం స్టాండర్డ్, బేసిక్ : మే 5
- హోమ్ సైన్స్: మే 2
- సైన్స్: మే 10
- సోషల్ సైన్స్ : మే 14
- హిందీ కోర్సు ఏ, కోర్సు బి : మే 18
- కంప్యూటర్ అప్లికేషన్స్: మే 23
పదో తరగతి పరీక్షల పూర్తి షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
12వ తరగతి పరీక్షల పూర్తి షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
సీబీఎస్ఈ 12వ తరగతి డేటా షీట్ 2022:
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 12వ తరగతి టర్మ్ 2 బోర్డు పరీక్షల తేదీ షీట్‌ను విడుదల చేసింది. టర్మ్ 1, టర్మ్ 2 అనే రెండు దశల్లో బోర్డు పరీక్షలను నిర్వహిస్తామని సీబీఎస్ఈ ఇంతకుముందు ప్రకటించింది. టర్మ్ 1 పరీక్ష ఫలితాలు ఇంకా ప్రకటించలేదు.