తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే భారీ వర్షాలు పడుతుండగా మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు పడతాయని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. 


ఏపీలో వర్షాలు


తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మరో 3 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రంతెలిపింది. తక్కువ ఎత్తులో నైరుతి గాలులు, పశ్చిమ గాలులు వీస్తుండటం వల్లే వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించింది. వచ్చే మూడు రోజుల్లో ఉత్తర కోస్తా ఆంధ్రా, యానాంలలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుసే అవకాశం ఉందని ప్రకటించింది. దక్షిణ కోస్తా ఆంధ్రాలో వచ్చే మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం వెల్లడించింది. 


లోతట్టు ప్రాంతాలు జలమయం


ఇవాళ, రేపు రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. గత రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల చెరువులకు కట్టలు తెగిపోయాయి. రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. మరో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలపడంతో అధికారులు ప్రజల్ని అప్రమత్తం చేశారు. అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న కారణంగా నివారణ చర్యలు చేపడుతున్నారు. పశ్చిమ, నైరుతి దిశ గాలులు వీస్తున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. 


Also Read:  Ind vs Eng, 2021: విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ... పరుగుల్లో కాదు... తెలిస్తే ఆశ్యర్యపోవడం ఖాయం


తెలంగాణలో వర్షాలు


తెలంగాణలో ఇప్పటికే భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ, రేపు కూడా పలు ప్రాంతాలలో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, నాగర్ కర్నూల్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, మెదక్, సిద్ధిపేట, జనగాం, యాదాద్రి జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. 


 


Also Read: Gold-Silver Price: తగ్గుతున్న పసిడి ధర, వెండి మాత్రం పైపైకి.. మీ నగరంలో నేటి తాజా ధరలు ఇవే..