ఈ రోజు కింది స్థాయిలోని గాలులు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.


హైదరాబాద్‌లో వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతం అయి కనిపించనుంది. ఉదయం వేళల్లో హైదరాబాద్ నగరంలో పొగ మంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 22 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో ఆగ్నేయ దిశలో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 30.7 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22.7 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 82 శాతంగా నమోదైంది.


నవంబర్ 9న దక్షిణ తెలంగాణ వ్యాప్తంగా చాలా జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కామారెడ్డి, జోగులాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి, మహబూబ్ నగర్, వికారాబాద్, నాగర్ కర్నూల్ తదితర జిల్లాలకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్ష సూచన ఉంది.


ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌, యానాంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు రెండు మూడు చోట్ల కురిసే అవకాశం ఉంది.


దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌, యానాంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు రెండు మూడు చోట్ల కురిసే అవకాశం ఉంది.


రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు రెండు మూడు చోట్ల కురిసే అవకాశం ఉంది.


‘‘నేటి నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకు తగ్గుతాయి అంటే ఈశాన్య రుతుపవనాల బలం తగ్గుతోంది కాబట్టి. దీని వలన నేడు మధ్యాహ్నం నుంచి సాయంకాలం మధ్య సమయంలో కోస్తా భాగాలైన తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలుంటాయి. అలాగే కృష్ణా, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలను చూడగలం. ఉభయ గోదావరి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో కూడ పలు భాగాల్లో వర్షాలను చూడగలం. సాయంకాలం నుంచి రాత్రి మధ్యలో సత్యసాయి, అనంతపురం, కడప​, అన్నమయ్య​, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలుంటాయి. ముఖ్యంగా కర్ణాటక సరిహద్దు భాగాల్లో కాస్త ఎక్కువ వర్షాలుంటాయి.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.