ఈ రోజు ఆవర్తనం గ్యాంగ్‌టక్ పశ్చిమ బెంగాల్  & పరిసరాలలోని ఉత్తర ఒడిశా దగ్గర సగటు సముద్ర మట్టంకి 1.5 కిమీ నుండి 7.6 కిమీ ఎత్తు మధ్య  కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశ వైపుకు వంగి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ రోజు తూర్పు పశ్చిమ ద్రోణి (షీర్ జోన్) సుమారుగా 17°N అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టం నుండి 4.5 కిమీ నుండి 7.6 కిమీ ఎత్తు మధ్య కొనసాగుతూ ఉంది. 


ఈ రోజు  రాష్ట్రంలో  తేలికపాటి నుండి మోస్తారు  వర్షాలు  చాలా చోట్ల  కురిసే అవకాశం ఉంది. రేపు మరియు ఎల్లుండి కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు  భారీ వర్షములు రాష్ట్రంలోని తూర్పు జిల్లాలలో అక్కడక్కడ  కురిసే అవకాశం ఉంది.  మరియు ఈ రోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. 


ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, మహబూబాబాద్‌, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీచేసినట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.


హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం పాక్షికంగా మేఘావృతంగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా చినుకులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 33 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు పశ్చిమ దిశ నుంచి గాలి వేగం గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 34.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 25.2 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 75 శాతంగా నమోదైంది.


ఏపీలో ఇలా
ఉత్తర కోస్తా, యానాంలో జూలై 6, 7 తేదీల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. అటు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30  నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే ఛాన్స్ ఉంది.


తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30  నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.


రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30  నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.