మంగళ, బుధవారాల్లో తెలంగాణ, ఏపీల్లో వాతావరణ పరిస్థితులను అధికారులు అంచనా వేశారు. పశ్చమ దిశ నుంచి వీస్తున్న శీతల గాలుల ఫలితంగా రెండు రాష్ట్రాల్లోనూ కాస్త చల్లటి వాతావరణం ఉండొచ్చని వాతావరణ అధికారులు వెల్లడించారు. తెలంగాణ సహా ఏపీలో కూడా ఒకటి లేదా రెండు చోట్ల ఓ మోస్తరు వానలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. చాలాచోట్ల వాతావరణం పొడిగానే ఉంటుందని వివరించారు.


తెలంగాణలో ఈ జిల్లాల్లో వానలు
హైదరాబాద్‌లోని వాతావరణ విభాగం అధికారిక వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం.. తెలంగాణ వ్యాప్తంగా ఎలాంటి వాతావరణ హెచ్చరికలు లేవు. కానీ, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజ్ గిరి, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. మిగతా ప్రాంతాల్లో వాతావరణ పొడిగానే ఉంటుందని వివరించారు.


Also Read: Gold-Silver Price: రెండ్రోజులుగా స్థిరంగా పసిడి ధర.. వెండి పైపైకి.. నేటి ధరలివీ..


ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఇలా..
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 3న కనిష్ఠ ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్‌గా, గరిష్ఠ ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. ఆకాశం మేఘాలతో నిండి అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.


దేశంలో వర్షపాతం ఇలా..
కేంద్ర వాతావరణ విభాగం గత నెల జులైలో దేశ వ్యాప్తంగా కురిసిన వర్షపాత సమాచారాన్ని ప్రకటించింది. ముంబయిలో వరదలు, తెలంగాణలో కాస్త అధిక వర్షపాతం ఉన్నా.. దేశవ్యాప్త సరాసరి పరిశీలిస్తే సాధారణం కంటే 7 శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది. జులై మొదటి వారంలో కేరళ నుంచి రుతుపవనాలు వచ్చాయని, అవి ఊపందుకున్నా చివరికి జులై నెలలో 7 శాతం లోటుతో వర్షపాతం ముగిసిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.


Also Read: KCR In Halia: హాలియాలో కేసీఆర్‌ గ్రాండ్ ఎంట్రీ, హెలికాప్టర్‌లో అలా.. డప్పుదరువులు.. రోడ్లన్నీ గులాబీమయం


దేశంలో వర్షాలు ఇలా..


ఆగస్టు 3న దేశంలోని పశ్చిమ కనుమల వెంట, మధ్యప్రదేశ్‌లోని కొన్ని చోట్ల, ఈశాన్య రాష్ట్రాల్లోనూ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు imd.gov.in వెబ్ సైట్ సందర్శించవచ్చును.


Also Read: Petrol-Diesel Price, 3 August: ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు.. ఇక్కడ మాత్రం స్థిరంగానే.. లేటెస్ట్ పెట్రోల్, డీజిల్ ధరలు ఇవీ..