నిన్నటి ద్రోణి విధర్భ నుంచి మరఠ్వాడ, ఉత్తర ఉంటీరియర్ కర్ణాటక మీదుగా ఇంటీరియర్ తమిళనాడు వరకూ సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తు వద్ద కొనసాగుతోందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాయలసీమ & పరిసర ప్రాంతాలలో తుపాను ప్రసరణ సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో తక్కువగా ఉంది.


ఈ వాతావరణ పరిస్థితుల వల్ల తెలంగాణలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షం, కొన్ని చోట్ల జల్లులు కురిసే అవకాశం ఉంది. రేపు కూడా (మార్చి 28న) తెలంగాణలో వాతావరణం పొడిగా ఉండనుందని వాతావరణ అధికారులు తెలిపారు. మార్చి 28 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని తెలిపారు.


వెదర్ వార్నింగ్స్ ఇవీ
నేడు (మార్చి 27) తెలంగాణలోని ఒకటి లేదా రెండు జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. దీనికి సంబంధించి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ఇక 28 నుంచి ఎలాంటి హెచ్చరికలు లేవని చెప్పారు.



హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 34 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. దక్షిణ దిశల నుంచి గాలులు గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 34.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.2 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 067 శాతం నమోదైంది.


ఏపీలో వర్షాలు ఇలా
ఏపీలో నేడు అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా అమరావతిలోని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో పాటు ఉత్తర కోస్తా, యానంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడా చెదురుమదురు వర్షాలు పడతాయని అంచనా వేశారు. రాయలసీమలో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపారు. నిన్నటితో పోలిస్తే గాలుల తీవ్రత అంతగా ఉండదని చెప్పారు.


ఢిల్లీలో వాతావరణం ఇలా..
గతంలో రాజధాని ఢిల్లీలో కురిసిన వర్షాల ప్రభావం పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో కనిపిస్తోంది. రెండేళ్లలో తొలిసారిగా మార్చి నెలలో దేశ రాజధాని ఢిల్లీ గాలి ఇంత పరిశుభ్రంగా కనిపిస్తోంది. మార్చి 25 వరకు సగటు AQI 78కి చేరుకుంది. ఇది కాకుండా, ఎన్‌సిఆర్ ప్రాంతంలో కాలుష్యానికి సంబంధించి చాలా మెరుగుదల కనిపించింది. మొత్తానికి ఈ వర్షం ఉత్తర భారతదేశంలోని రైతులకు పెద్ద సమస్యగా మారింది.


ఢిల్లీ సహా ఎన్‌సిఆర్‌లో మంచి వర్షాలు కురిస్తే, అది అనేక విధాలుగా సహాయపడుతుందని పర్యావరణ నిపుణులు గతంలో ధృవీకరించారు. ముఖ్యంగా ఢిల్లీలో నానాటికీ పెరిగిపోతున్న కాలుష్యానికి వర్షం ఉండాల్సిందే. ఢిల్లీలో సగటు AQI సంఖ్య 78గా నమోదైంది. మరోవైపు, నోయిడాలో AQI 74 మరియు గురుగ్రామ్‌లో AQI 70 ఎన్‌సిఆర్ ప్రాంతంలో పడిపోయింది. ఇది కాకుండా, గ్రేటర్ నోయిడాలో AQI 68 మరియు ఘజియాబాద్‌లో AQI 64 నమోదైంది. రాజధాని ఢిల్లీలోని అత్యంత కలుషిత ప్రాంతాలలో షాదీపూర్ మరియు ఆనంద్ విహార్‌లు ఉన్నాయి, ఇక్కడ AQI 177 మరియు 101 గణాంకాలు నమోదు అయ్యాయి.