Weather Latest News: ద్రోణి / గాలి విచ్చిన్నతి ఒకటి తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మరియు దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి. మీ ఎత్తులో కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నిన్న మరాత్వాడ మరియు దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 1.5 కి. మీ ఎత్తులో కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు బలహీనపడింది. 


రాగల 3 రోజులకు వాతావరణ సూచన (Weather Forecast): 


ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ, రేపు మరియు ఎల్లుండి కొన్ని చోట్ల కురిసే అవకాశం వుంది. 


వాతావరణ హెచ్చరికలు (Weather Warnings)
ఈరోజు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడ అక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉంది మరియు కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 - 40 కి. మీ వేగంతో వీచే ఈదురుగాలతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉంది.
 
రేపు రాష్ట్రంలో కొన్ని జిల్లాలల్లో అక్కడ అక్కడ ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 - 50 కి. మీ వేగంతో వీచే ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం వుంది. ఎల్లుండి కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 - 50 కి. మీ వేగంతో వీచే ఈదురుగాలతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉంది


ఇక్కడ ఆరెంజ్ అలర్ట్
మే 7న ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు (గాలి వేగం గంటకు 40 నుంచి 50 కి.మీ.) కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.


Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 41 డిగ్రీలు, 28 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వాయువ్య దిశగా ఉండే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 42.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 28.1 డిగ్రీలుగా నమోదైంది. 55 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.


ఏపీలో వాతావరణం ఇలా
Andhra Pradesh Weather News: ద్రోణి మరఠ్వాడ నుంచి దక్షిణ తమిళనాడు వరకు విస్తరించి ఈరోజు తూర్పు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ, అంతర్గత కర్ణాటక నుంచి సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో దక్షిణ, నైరుతి గాలులు వీస్తున్నాయని తెలిపారు. 


తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది.


దక్షిణ కోస్తాలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. రాయలసీమలో కూడా వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. వేడి రాత్రులు ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడవచ్చని వాతావరణ అధికారులు తెలిపారు.