Weather Latest News: సెప్టెంబరు 2న హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిన్న దక్షిణ ఒడిశా, పరిసర దక్షిణ ఛత్తీస్‌గఢ్ - ఉత్తర ఆంధ్రప్రదేశ్ వద్ద  కేంద్రీకృతమైన వాయుగుండం ఈరోజు ఉదయం 0830 గం.లకు తూర్పు విదర్భ, పరిసర తెలంగాణ ప్రాంతంలో రామగుండంకు ఉత్తర-ఈశన్య దిశలో సుమారు 130 కి. మీ. దూరంలో కేంద్రీకృతమై ఉన్నది. ఇది రాగల 12 గం.లలో విదర్భ మీదుగా కదులుతూ ప్రస్పుటమైన అల్ప పీడన ప్రాంతంగా మరే అవకాశం ఉంది. 


ఋతుపవన ద్రోణీ ఈరోజు సగటు సముద్రమట్టం నుండి జైసల్మయిర్, రైసెన్, చింద్వారా మరియు తూర్పు విదర్భ మరియు పరిసర తెలంగాణ ప్రాంతంలో వద్ద కేంద్రీకృతమైన వాయుగుండం యొక్క కేంద్ర ప్రాంతం నుండి మచిలీపట్నం మీదుగా పశ్చిమ -మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్నది.


రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast):
ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు చాలా చోట్ల, రేపు చాలా చోట్ల ఎల్లుండి కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.


వాతావరణ హెచ్చరికలు (weather warnings):
ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉంది. ఈరోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాలలో ఉరుములు మరియు  ఈదురుగాలులు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో అక్కడ అక్కడ వీచే అవకాశం వుంది.


నేడు భారీ వర్షాలు తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరిలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. 


Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 24 డిగ్రీలు, 22 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు నైరుతి దిశలో వీచే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 10 - 12 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 23.9 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 21.4 డిగ్రీలుగా నమోదైంది. 91 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.


ఏపీలో వాతావరణం ఇలా
Andhra Pradesh Weather News: సగటు సముద్రమట్టం వద్ద రుతుపవనాల ద్రోణి ఇప్పుడు జైసల్మేర్, రైసేన్, చింద్వారా, తూర్పు విదర్భ ప్రాంతంలో ఉన్న వాయుగుండం కేంద్రం గుండా దానిని ఆనుకొని ఉన్న తెలంగాణ, మచిలీపట్నంలో గుండా వెళ్తూ అక్కడి నుంచి ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ఉంటుంది. 


షియర్ జోన్ లేదా గాలుల కోత ఇప్పుడు ఉత్తర భారత దేశ ద్వీపకల్పంలో సగటు సముద్ర మట్టానికి 3.1 కిలో మీటర్లు, 5.8 కిలో మీటర్ల ఎత్తు మధ్య సుమారుగా 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం వెంబడి విస్తరించి ఉంది. పశ్చిమ మధ్య, దానిని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో వేరొక అల్ప పీడనం సెప్టెంబర్ 5 నాటికి ఏర్పడే అవకాశం ఉంది. 


ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది.  భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.


దక్షిణ కోస్తాలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు కొన్ని చోట్ల 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బలమైన ఈదురు గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపారు.