Weather Latest News: ఉపరితల ఆవర్తనం ఒకటి దక్షిణ మధ్యప్రదేశ్, పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ద్రోణి / గాలి విచ్చిన్నతి ఒకటి దక్షిణ మధ్యప్రదేశ్, పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఆవర్తనం నుంచి విదర్భ, మరాత్వాడ  మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో కొనసాగుతుందని తెలిపారు. నిన్న తెలంగాణ, పరిసర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈరోజు బలహీనపడింది.


నిన్న తెలంగాణ, పరిసర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుండి దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో కొనసాగిన  ద్రోణి / గాలి విచ్చిన్నతి ఈరోజు రాష్ట్రానికి దూరంగా కదిలిపోయింది.


రాగల 3 రోజులకు వాతావరణ సూచన (Weather Forecast): 


ఈ రోజు, రేపు  రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం వుంది. ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది.


వాతావరణ హెచ్చరికలు (Weather Warnings)


ఎల్లుండి రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మొస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది. ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో అక్కడ అక్కడ వడగాల్పులు వీచే అవకాశం వుంది.


Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 41 డిగ్రీలు, 27 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో ఆగ్నేయ దిశగా ఉండే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 39.9 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 26.2 డిగ్రీలుగా నమోదైంది. 33 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.


ఏపీలో వాతావరణం ఇలా
Andhra Pradesh Weather News: ద్రోణి ఇప్పుడు మరఠ్వాడా, అనుకొని ఉన్న మధ్య మహారాష్ట్ర మీద ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర కోస్తా తమిళనాడు వరకు, ఉత్తర అంతర్గత కర్ణాటక, రాయలసీమ మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తెలంగాణ, దానిని ఆనుకొని ఉన్న కోస్తాంధ్ర మీద సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం బలపడిందని తెలిపారు.


ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. వేడి తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. రాయలసీమలో కూడా వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.