Weather Latest News: జూలై 23న హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిన్న తూర్పు మధ్యప్రదేశ్, పరిసర ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో కొనసాగిన అల్పపీడనం ఈరోజు బలహీనపడింది. దీని అనుబంధ ఆవర్తనం ఝార్ఖండ్, దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 7.6 కి. మీ. ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణం వైపుకు వంగి ఉన్నది. ఋతుపవన ద్రోణి ఈరోజు బికనేర్, గ్వాలియర్, ఖజురాహో, రాంచి, గుండా వెళుతూ సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో కొనసాగుతున్నది.
రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast):
ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలాచోట్ల, రేపు మరియు ఎల్లుండి కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.
Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 27 డిగ్రీలు, 22 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు పశ్చిమ, దక్షిణ - పశ్చిమ దిశలో వీచే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 6 - 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 29.5 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.4 డిగ్రీలుగా నమోదైంది. 87 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.
ఏపీలో వాతావరణం ఇలా
Andhra Pradesh Weather News: ‘‘తూర్పు మధ్య ప్రదేశ్, దానిని ఆనుకొని ఉన్న ఛత్తీస్ గఢ్ లో సగటు సముద్ర మట్టానికి 7.6 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించిన అల్పపీడన ప్రాంతం ఇప్పుడు బలహీనపడింది. ఉపరితల ఆవర్తనం ఇప్పుడు జార్ఖండ్, పరిసర ప్రాంతాలపై ఉంది. పైగా ఎత్తుతో దక్షిణం వైపు వంగి ఉంటుంది. షీర్ జోన్ దాదాపుగా 22 డిగ్రీల ఉత్తర అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టం నుంచి 3.1 మరియు 7.6 కిలో మీటర్ల మధ్య ఎత్తుతో దక్షిణం వైపు వంగి ఉంటుంది.
ఉత్తర ఛత్తీస్ గఢ్, పొరుగున ఉన్న అల్పపీడన ప్రాంతం ఇప్పుడు తూర్పు మధ్యప్రదేశ్, దానిని ఆనుకొని ఉన్న ఛత్తీస్ గఢ్ పై ఉంది. అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టం నుంచి 7.6కిలో మీటర్ల వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలది ఆగ్నేయ దిశగా వంగి ఉంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపోస్పిరిక్ స్థాయిలో పశ్చిమ దిశగాలులు వీస్తున్నాయి.
జూలై 23న అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాలోనూ ఓ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు కొన్ని చోట్ల 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపారు.