Weather Latest News: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఆవర్తనం సముద్ర మట్టం నుండి 3.1 కి. మీ ఎత్తు వరకూ ఆవరించి ఉన్నది. దీని ప్రభావంతో ఈనెల 22 వ తారీఖు నాటికీ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక అల్ప పీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్ప పీడనం ఈశాన్య దిశలో కదిలి ఈనెల 24 నాటికి మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. తర్వాత ఈ వాయుగుండం ఈశాన్య దిక్కులోనే కదులుతూ మరింత బలపడే అవకాశం ఉంది’’ అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast):
ఈ రోజు రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది.
వాతావరణ హెచ్చరికలు (weather warnings)
ఈరోజు రేపు, ఎల్లుండి రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఉరుములు, ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 - 40 కి. మీ. వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది.
ఇక్కడ ఎల్లో అలర్ట్
మే 21న ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు (గాలి వేగం గంటకు 30 నుంచి 40 కి.మీ.) కూడిన వర్షాలు తెలంగాణలో ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 37 డిగ్రీలు, 26 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల ఈదురు గాలులు ఆగ్నేయ దిశలో వీచే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 6 - 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 36 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 25.6 డిగ్రీలుగా నమోదైంది. 72 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.
ఏపీలో వాతావరణం ఇలా
Andhra Pradesh Weather News: నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్రమట్టానికి 3.1 కిలో మీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ప్రభావంతో మే 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది ఈశాన్య దిశగా కదులుతూ 24 మే ఉదయం నాటికి బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఇది ఈశాన్య దిశగా కదులుతూ ఆ తర్వాత మరింత బలపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ద్రోణి ఇప్పుడు నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర అంతర్గత కర్ణాటక, రాయలసీమ మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఉందని తెలిపారు. వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిశా - పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా సముద్ర మట్టానికి 3.1 కిలో మీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం బలహీన పడింది
ఉత్తర కోస్తాలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు కొన్ని చోట్ల 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
రాయలసీమలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు కొన్ని చోట్ల 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.