Weather Latest News: ఆగస్టు 20న హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిన్న రాయలసీమ, దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 0.9 కి. మీ ఎత్తు వరకు విస్తరించి ఉన్న ఆవర్తనం ఈరోజు బలహీనపడింది. రాయలసీమ, దాని పరిసర ప్రాంతాలలో కొనసాగుతున్న ఆవర్తనం నుంచి తమిళనాడు మీదుగా కోమరిన్  ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి. మీ ఎత్తులో కొనసాగుతున్న నిన్నటి ద్రోణి, ఈ రోజు బలహీనపడింది. తెలంగాణ రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానంగా దక్షిణ, ఆగ్నేయ దిశల నుండి వీచుచున్నాయి.


వచ్చే 3 రోజుల వరకు వాతావరణ విశ్లేషణ 
ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా చోట్ల, రేపు, ఎల్లుండి  కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.


వాతావరణ హెచ్చరికలు (Weather Warnings)
ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది. ఈరోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం వుంది.


వాతావరణ హెచ్చరికలు (weather warnings)
ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది. ఈరోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు మరియు మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం వుంది. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.


Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు దక్షిణ-ఆగ్నేయ దిశలో వీచే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 8 - 12 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 32.9 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22.5 డిగ్రీలుగా నమోదైంది. 96 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.


ఏపీలో వాతావరణం ఇలా
Andhra Pradesh Weather News: ఉపరితల ఆవర్తనం ఉత్తర తమిళనాడు, దానికి ఆనుకొని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మీదుగా సగటున సముద్రమట్టానికి 1.5 కిలో మీటర్ల దూరంలో ఉంది. నిన్నటి ద్రోణి రాయలసీమ, పరిసన ప్రాంతాల ఉపరితల ఆవర్తనం నుంచి తమిళనాడు గుండా కొమొరిన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల వరకు విస్తరించి తక్కువగా గుర్తించారని అమరావతి వాతావరణ అధికారులు తెలిపారు.


ఆగస్టు 20న అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు (Andhra Pradesh Weather) వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది.  భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.


దక్షిణ కోస్తాలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు కొన్ని చోట్ల 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన ఈదురు గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపారు.