Weather Latest News: నైరుతి ఋతుపవనాలు ఈరోజు మాల్దీవులు లో కొంతవరకు, కోమరిన్ ప్రాంతంలో కొంత వరకు, దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాల వరకు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నిన్న దక్షిణ ఛత్తీస్ గఢ్ నుండి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మి ఎత్తులో కొనసాగిన ఆవర్తనం ఈరోజు బలహీన పడిందని తెలిపారు.
రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast):
ఈ రోజు, రేపు, ఎల్లుండితెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు కొన్ని చోట్ల, అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది.
వాతావరణ హెచ్చరికలు (weather warnings)
ఈరోజు రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 - 40 కి. మీ. వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది.
ఇక్కడ ఎల్లో అలర్ట్
మే 20న ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు (గాలి వేగం గంటకు 30 నుంచి 40 కి.మీ.) కూడిన వర్షాలు తెలంగాణలో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో గాలులు (40-50 కి.మీ.) తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతో పాటు వీచే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 33 డిగ్రీలు, 25 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల ఈదురు గాలులు ఆగ్నేయ దిశలో వీచే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 6 - 8 కిలో మీటర్ల నుంచి వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 32.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.7 డిగ్రీలుగా నమోదైంది. 81 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.
ఏపీలో వాతావరణం ఇలా
Andhra Pradesh Weather News: తెలుుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారతానికి జీవ ప్రదాయిని అయిన నైరుతి రుతుపవనాలు మే 19 నాటికే దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవులలోకి ప్రవేశించాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుంచి తూర్పు విదర్భ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఉన్న ద్రోణి బలహీనపడింది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో ఆగ్నేయ గాలులు వీస్తున్నాయని వాతావరణ అధికారులు తెలిపారు.
ఉత్తర కోస్తాలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు కొన్ని చోట్ల 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
రాయలసీమలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు కొన్ని చోట్ల 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.