Weather Latest News:  నిన్న రాయలసీమ నుండి పశ్చిమ - మధ్య బంగాళాఖాతం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టం నుంచి 3.1కి. మీ, 5.8 కి.మీ. మధ్యలో కొనసాగిన ద్రోణి ఈరోజు అదే ప్రాంతంలో కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈరోజు కింది స్థాయిలోని గాలులు పశ్చిమ, వాయువ్య దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈరోజు క్రింది స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయని తెలిపారు.


రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast): 


ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల  కురిసే అవకాశం ఉంది.


వాతావరణ హెచ్చరికలు (weather warnings)


రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు కొన్ని జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు గంటకు 30 నుండి 40 కి. మి  వేగంతో కూడిన  తేలికపాటి నుండి మొస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.  


నేడు భారీ వర్షాలు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు (30 - 40 కిలో మీటర్ల వేగంతో) కూడిన వర్షాలు ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. 




Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు సాయంత్రం, రాత్రి సమయాల్లో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 34 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు పశ్చిమ దిశలో వీచే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 6 - 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 33.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 25.1 డిగ్రీలుగా నమోదైంది. 76 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.


ఏపీలో వాతావరణం ఇలా
Andhra Pradesh Weather News: రుతుపవనాల ఉత్తర పరిమితి ఇప్పుడు నవ్‌సారి, జల్గావ్, అమరావతి, చంద్రాపూర్, బీజాపూర్, సొక్కా, మల్కన్ గిరి, విజయనగరం, ఇస్లాంపూర్ గుండా కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు తర్వాతి 4 నుంచి 5 రోజుల్లో మహారాష్ట్ర, చత్తీస్ గడ్, ఒడిశా, కోస్తా ఆంధ్రా, వాయువ్య బంగాళాఖాతం గంగా పశ్చిమబెంగాల్ లోని కొన్ని ప్రాంతాలు, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్ లోని మిగిలిన భాగాలు, బీహార్ లోని కొన్ని ప్రాంతాలలో మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.


అమరావతి వాతావరణ విభాగం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర కోస్తాలో తేలికపాటి రాబోయే మూడు రోజులు ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలుల వల్ల గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలోనూ ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు కొన్ని చోట్ల 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


రాయలసీమలోనూ ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.