Wardhannapet Woman Conductor Video: బహిరంగ ప్రదేశాల్లో తాగుబోతుల చేష్టలు కొన్ని చోట్ల మరీ అభ్యంతరకరంగా ఉంటున్నాయి. కొందరు తాగిన మైకంలో నోటికొచ్చినట్లు వాగుతున్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇంకొందరు ఫూటుగా తాగేసి ఎక్కడ పడితే అక్కడ కూలబడిపోతున్నారు. తాజాగా పీకల తాగి బస్సు ఎక్కిన మందు బాబు చేసిన వెకిలి చేష్టలకు ఓ మహిళా కండక్టర్ తగిన బుధ్ధి చెప్పారు. అతనికి అందరి ముందే దేహశుద్ది చేశారు. అతను చేసిన పనికి బస్సు ఆపించి మరీ చెప్పుతో కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ ఘటన వరంగల్ జిల్లా వర్థన్నపేట బస్టాండ్‌లో జరిగింది.


వర్థన్న పేటలో ఓ వ్యక్తి పట్టపగలే పీకల దాకా మద్యం తాగాడు. ఆ తర్వాత ఆర్టీసీ బస్సు ఎక్కాడు. వర్దన్నపేట ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో తొర్రూరు వైపు వెళ్తున్న బస్సులోకి ఈ మందుబాబు ఫుల్లుగా తాగి ఎక్కాడు. కుదురుగా ఉండకుండా కాస్త ఓవర్ చేశాడు. కండక్టర్ వచ్చి టికెట్ తీసుకోమంటే హెచ్చులకు పోయాడు. మహిళా కండక్టర్‌తో అసభ్యంగా ప్రవర్తించాడు. దాన్ని సహనంతోనే భరించిన మహిళా కండక్టర్‌, మందుబాబు వెకిలి వేషాలు మరీ మితిమీరడంతో సహనం పట్టలేకపోయింది. వెంటనే అతణ్ని బయటకు లాక్కొచ్చి చెప్పుతో కొట్టి సమాధానం ఇచ్చింది. వరంగల్‌ జిల్లా వర్థన్న పేటలో ఈ ఘటన జరిగింది. వెంటనే స్థానికుల సాయంతో మహిళా కండక్టర్ పోలీసులకు సమాచారం ఇచ్చింది. కానీ, అతను వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.