Parthenium Plant News: రైతుల పాలిట పార్థేనియం కలుపు మొక్క శాపంగా మారింది. పంట దిగుబడికి గండి కొట్టడంతో పాటు మనుషులను శ్వాసకోశ సంబంధిత రోగాల భారీన పడేలా చేస్తుంది పార్థేనియం మొక్క. ఈ మొక్క పంట పొలాల్లో విచ్చలవిడిగా పెరిగి రైతుల పంటలను నాశనం చేస్తుంది. 


ఇదిగో ఇక్కడ చూడ్డానికి తెల్లపూలతో అందంగా, వయ్యారంగా ఉన్న ఈ మొక్క పేరే పార్థేనియం మొక్క. దీనిని రైతులు ముక్కుపుల్ల వనం, వయ్యారిభామ మొక్కగా పిలుస్తారు. ముక్కుపుల్లవనంగా రైతుల భాషలో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. ఎందుకంటే దీని పువ్వులు ముక్కుపుల్ల ఆకారంలో ఉండడంతో ముక్కుపులవనంగా రైతులు పిలుస్తుంటారు. కలుపు మొక్కల్లో ప్రధానమైన కలుపు మొక్క వయ్యారిభామ.


ఈ కలుపు మొక్క రైతుల పంటలను నాశనం చేస్తుంది. పంట పొలాల్లో విచ్చలవిడిగా పెరిగి పంట దిగుబడికి అడ్డుకట్ట వేస్తుంది.  వయ్యారిభామ ఒక్క మొక్క కొన్ని లక్షల విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. దీని విత్తనాలు భూమి పై పడితే లక్షల్లో మొక్కలు మొలిచి పంట రూపంలో కనిపిస్తుంది. ప్రధానంగా పత్తి, మొక్కజొన్న, మిర్చి పంటలతో పాటు పొలంగట్లపై విస్తారంగా మొలిచి రైతుల పంటలను నాశనం చేస్తుంది. ఈ మొక్కను అరికట్టడానికి రైతులు ఎంత ప్రయత్నం చేసిన సాధ్యం కావడం లేదు.


కాలంతో సంబంధం లేకుండా వయ్యారిభామ మొక్క పంట పొలాల్లో విస్తారంగా పెరుగుతుంది. ఈ మొక్క అనేక పంట తెగుళ్లకు స్థావరంగా మారుతుంది. అనేక తెగుళ్లు వయ్యారిభామ మొక్క పువ్వుల నుంచి తెగుళ్ల వ్యాప్తికి కారణం అవుతుంది. రైతులు ఈ కలుపు మొక్కను పీకేసి తగలపెట్టడం జరుగుతుంది. దీని నివారణకు రైతులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోతుంది. వయ్యారిభామ మొక్క పంట దిగుబడితోపాటు మనుషులపై తీవ్ర దుష్ప్రభావాలను చూపుతుంది. ఈ మొక్క శ్వాసకోశ వ్యాధులకు కారణమం అవుతుంది. దీని పుప్పొడి మూడు కిలోమీటర్లు వ్యాపించి మనుషులు అనేక అలెర్జీల బారిన పడేలా చేస్తుంది. పశువులకు సైతం అనేక అలర్జీలకు కారణమవుతుంది.. వయ్యారిభామ కలుపు మొక్క. పంటకు తీవ్రహాని చేస్తుందని దీనిని కోసి దగ్ధం చేసినా ఫలితం లేకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట దిగుబడికి అడ్డంకిగా మారడంతోపాటు శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని రైతులు చెబుతున్నారు.


గడ్డి మందుకూ లొంగదు
మరో రైతు మాట్లాడుతూ కలుపు మొక్కలకు కొట్టే గడ్డి మందు కొట్టిన ఈ మొక్క చనిపోవడం లేదని చెప్పారు. దీని నివారణకు ప్రభుత్వం మార్గాలను వెతకాలని రైతు కుమారస్వామి కోరుతున్నారు. అయితే ఈ మొక్క పంట పొలాల్లోనే కాదు. జనవాసాల మధ్య కూడా విచ్చలవిడిగా పెరుగుతుంది. ఇళ్ల చుట్టూ ప్రక్కల కనిపిస్తాయి. ఈ మొక్క పై రైతులకు తప్ప సాదారణ ప్రజలు తెలియదు. ప్రధాన కలుపు మొక్కల్లో పార్టీనియం మొక్క ప్రమాదకరమైన ముక్కని వ్యవసాయ శాస్త్రవేత్త ఉమారెడ్డి తెలిపారు ఈ మొక్క పంట దిగుబడికి తీవ్ర హాని చేయడంతో పాటు మనుషుల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు రావడానికి కారణం అవుతుందని ఆయన తెలిపారు రైతులు ఈ మొక్క ఎదుగుదల ప్రారంభంలోనే నివారించాలని చేతులతో ముట్టుకోవద్దని శాస్త్రవేత్త ఉమారెడ్డి రైతులకు సూచిస్తున్నారు.