Warangal News: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాలు బోసి పోతున్నాయి. క్యాంప్ ఆఫీసులోకి కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు అడుగుపెట్టడం లేదు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొన్ని క్యాంప్ కార్యాలయాలు గెస్ట్ హౌస్ లగా... గెస్ట్ హౌస్ లు క్యాంప్ కార్యాలయాలుగా మారాయి. మరికొన్ని తాళాలు తెరుచుకోవడం లేదు. కొందరు ఇగో మరికొందరు వాస్తు అనుమానంతో ఎమ్మెల్యేలు క్యాంప్ ఆఫీస్ లకు వెళ్ళడం లేదనే ప్రచారం జరుగుతుంది.
గత ప్రభుత్వంలో నిర్మాణం
ఎమ్మెల్యేలు నియోజకవర్గ కేంద్రంలో అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో గత ప్రభుత్వం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లను నిర్మించింది. నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంతో పాటు నివాసం ఉండే విధంగా నిర్మించడం జరిగింది. ఒక్కో క్యాంప్ ఆఫీసు ను ఒక కోటి బడ్జెట్ తో నియోజకవర్గాల్లో నిర్మించింది బీ అర్ ఎస్ ప్రభుత్వం. రాష్ట్రంలో కొత్తగా క్యాంప్ కార్యాలయాలు నిర్మాణం కావడంతో బీఅర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు క్యాంప్ కార్యాలయాల్లోకి వెళ్ళారు. 2023 ఎన్నికల్లో గెలిచిన గతంలో ఎమ్మెల్యేగా ఉండి తిరిగి గెలిచిన వారు కొనసాగగా.. కొత్తగా గెలిచిన వారు క్యాంప్ కార్యాలయాల్లో అడుగు పెట్టడం లేదు.
క్యాంప్ ఆఫీస్ ల్లోకి అడుగు పెట్టని ఇద్దరు ఎమ్మెల్యేలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11 ఎమ్మెల్యేలు అండగా కొందరు క్యాంప్ ఆఫీసు ముఖం చూడకపోతే.. మరికొందరు వెళ్ళమా కొద్ది సేపు ఉన్నామా అన్న విధంగానే ఉన్నారు. నర్సంపేట ఎమ్మెల్యేగా గెలిచిన దొంతి మాధవ రెడ్డి క్యాంప్ ఆఫీసు ముఖం చూడలేదు. గతంలో ఎమ్మెల్యే గా ఉన్న సుదర్శన్ రెడ్డి ఓడిపోగానే ఖాళీ చేసి వెళ్ళారు. మాధవ రెడ్డి క్యాంప్ కార్యాలయం కు వెళ్ళలేదు. మాధవ రెడ్డి నర్సంపేట నుండి రెండవ సారి ఎమ్మెల్యేగా గెలిచారు. మాధవరెడ్డి ఎవరు ఏమనుకున్నా ఎన్ని విమర్శలు వచ్చిన తనకు నచ్చినట్టు చేస్తారు. క్యాంప్ ఆఫీస్ విషయంలో కూడా ఇదే జరిగింది. వెళ్ళనంటే వెళ్లనని నర్సంపేట క్యాంప్ ఆఫీస్ ను ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ గా మార్పు చేసి.
ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ ను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ గా మార్చుకున్నారు. గెస్ట్ హౌస్ ను క్యాంప్ ఆఫీస్ గా మార్చుకొని ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. మాధవ రెడ్డి పై ఎన్ని విమర్శలు వచ్చిన పట్టించుకోవడంలేదు. ఇక మరో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. పాలకుర్తి నియోజకవర్గం నుండి గెలిచిన అతిచిన్న వయసులో గెలిచిన ఎమ్మెల్యే. అంతేకాదు ఓటమి ఎరుగని దయాకర్ రావు పై విజయం సాధించి రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందారు. యశస్విని రెడ్డి క్యాంప్ ఆఫీసు లోకి వెళ్ళడంలేదు. వాస్తు దోషం ఉందనే కారణంతో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి క్యాంప్ కార్యాలయానికి వెళ్ళడంలేదట. మరో ప్రచారం లేకపోలేదు. రాజకీయంగా అనేక ఇబ్బందులకు గురిచేసిన దయాకర్ రావు ఉన్న ఆఫీస్ లోకి వెళ్ళడం లేదనే ప్రచారం లేకపోలేదు. యశస్విని రెడ్డి తొర్రూరు లోని నివాసం వద్ద ప్రజలకు అందుబాటు ఉంటూ పాలనను సాగిస్తున్నారు.
వాస్తు భయంతో చేర్పులు.. మార్పులు
వరంగల్ ఎమ్మెల్యే, మంత్రి కొండా సురేఖ సైతం గెలిచిన తరువాత చాలా కాలం వెళ్లలేదు. కారణం వాస్తు. క్యాంప్ ఆఫీస్ ను వాస్తు ప్రకారం పునరుద్ధరించి తరువాత కొద్ది రోజుల క్రితం క్యాంప్ కార్యాలయంకు వెళ్ళారు. ఒక పరకాల, భూపాలపల్లి, డోర్నకల్, మహబూబాబాద్, స్టేషన్ ఘాన్ పూర్, జనగామ ఎమ్మెల్యే లు వాస్తు పరంగా చేర్పులు మార్పులు చేసుకొని క్యాంప్ కార్యాలయాలకు వెళ్లారు. క్యాంప్ ఆఫీస్ లో ఎవరు ఉండడం లేదు. మంత్రి సీతక్క అప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే కావడంతో క్యాంప్ ఆఫీసు నుండే పాలనను సాగిస్తున్నారు. ఒక్క
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గెలవగానే క్యాంప్ ఆఫీస్ లో ఉంటున్నారు.
కార్యకర్తలకు గెస్ట్ హౌస్ లు
ప్రధానంగా దొంతి మాధవ రెడ్డి, యశస్విని రెడ్డి లు వెళ్లకపోవడంలో తాళాలు వేసి దర్శనమిస్తున్నాయి. మిగితా ఎమ్మెల్యే లు ఫ్యామిలీతో ఉండకున్న క్యాంప్ ఆఫీసు కు వచ్చి ప్రజల నుండి వినతులు, అధికారిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అనంతరం కార్యకర్తలకు గెస్ట్ హౌస్ గా మరుతున్నాయానే ఆరోపణలు లేకపోలేదు.