Warangal News: తన పంట పొలానికి దిష్టి తగాలకుండా ఉండేందుకు ఓ రైతు వినూత్న ఆలోచన చేశాడు. బాలీవుడ్ హాట్ బ్యూటీ, హీరోయిన్ సన్నీలియోన్ బికినీ వేసుకొని ఉన్న ఫొటోను పంట పొలంలో పెట్టాడు. వంరగల్ కు చెందిన ఓ రైతు తమ పంటకు దిష్టి తగలకుండా ఉండాలని... బికినీ వేసుకుని ఉన్న సన్నీ లియోన్ ఫొటోను వెదురు కర్ర సహాయంతో పెట్టాడు. దీంతో దారి వెంట పోయేవాళ్ల కళ్లన్నీ ఆ బికినీ బొమ్మపై మాత్రమే ఉండి ఇతరుల దృష్టి మరల్చే ప్రయత్నం చేశాడు.
సన్నీలియోన్ ఫోటో అడ్డు..
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామంలో రైతు వినూత్న ఆలోచన తన మిరుప తోటకు దిష్టి తగలకుండా సన్నీ లియోన్ ఫ్లెక్సీనీ ఏర్పాటు చేశాడు. ఎల్లంపేట గ్రామానికి చెందిన రైతు కొమురయ్య తనకు ఉన్న ఎకరం భూమిలో మిరుప తోట సాగు చేయగా.. గత ఏడాది పంటకు దిష్టి తగిలి పెట్టుబడులు కూడా రాలేదు అని చెప్పాడు. అందుకే ఈసారి రోడ్డు పక్కన ఉన్న తన పంట పొలంపై రోడ్డు మార్గం గుండా వెళ్లే వారి చూపు తోటపై పడికుండా ఉంటుందని భావించి సన్నీ లియోన్ ఫ్లెక్సీనీ తోటలో ఏర్పాటు చేశాడు. దీంతో ఇతరుల చూపు ఫ్లెక్సీపై పడి తోట మెరుగు పడుతుంది అని రైతు కొమురయ్య అంటున్నాడు. దీంతో రైతు ఆలోచనకు పరిసర ప్రాంత రైతులు ఔరా అంటున్నారు.
గతంలో అభిమానంతో కేసీఆర్ ఫొటో చేనులో పెట్టుకున్న రైతులు..
కరీంనగర్ జిల్లాలోని దుర్షేడ్ గ్రామంలో రైతులు సీఎం కేసీఆర్ మంత్రి గంగుల కమలాకర్ కటౌట్ లకు పాలాభిషేకం నిర్వహించారు. బుధవారం గ్రామంలోని వరి పొలంలో అభిషేకం నిర్వహించి అసలైన రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని నినాదాలు చేశారు. అనంతరం రైతులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులను నట్టేట ముంచాలని చూస్తే సీఎం కేసీఆర్ ప్రతి గింజలు తామే ఉంటామని ప్రకటించి మరోసారి రైతు పక్షపాతి అని నిరూపించారన్నారు. జయహో కేసీఆర్ అంటూ కటౌట్లు తయారు చేసి పొలాల్లో ప్రదర్శిస్తూ ఆనందం వ్యక్తం చేయడం ఆకట్టుకుంది