Warangal News: అధికారులు, సిబ్బంది సంక్షేమం పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తానని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్యాస్ సిలిండర్ డోర్ డెలవరీ వాహనాన్ని సీపీ ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. నిరంతరం విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది తమ ఇంటి అవసరాలకు వినియోగించే వంట గ్యాస్ ను కమిషనరేట్ కార్యాలయం గ్యాస్ గోడౌన్ నుంచి వారి ఇండ్లకు తీసుకెళ్లేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే విషయం గుర్తించిన సీపీ పోలీసు సిబ్బందితో పాటు కుటంబ సభ్యులకు ఈ సమస్య తప్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. సిబ్బందికి సిలెండర్ తరలింపు భారాన్ని తగ్గించేందుకుగాను వరంగల్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం గ్యాస్ డోర్ డెలివరీ కోసం వాహనాన్ని ఏర్పాటు చేశారు. 




ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. ప్రథమంగా ట్రై సిటీ పరిధిలో విధులు నిర్వహించే వరంగల్ పోలీస్ కమిషనరేట్ సిబ్బంది డోల్ డెలివరీ గ్యాస్ కావాలనుకుంటే... 8454955555 నంబర్ కు ఫోన్ చేసి గ్యాస్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని వవరించారు. మొదటి ప్రాధాన్యత ప్రకారం సిబ్బందికి సిలెండర్ డెలవరీ వాహనం ద్వారా సిలెండర్ డోర్ డెలివరీ చేయడబడుతుందని చెప్పారు. అయితే 1999వ సంవత్సరంలో వరంగల్ పోలీస్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా ప్రారంభమైన ఈ గ్యాస్ పంపిణీ కార్యక్రమములో ఇప్పటి వరకు 2,133 మంది సిబ్బంది సభ్యులగా ఉన్నారని తెలిపారు. రానున్న రోజుల్లో సిబ్బంది సంక్షేమం కోసం ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తామని కమిషనర్ వివరించారు. ఈ కార్యక్రమములో ఏ.ఆర్ అదనపు డీసీపీ సంజీవ్, ఏసీపీ నాగయ్య, పోలీస్ సంక్షేమం ఆర్.ఐ. నగేష్. యం.టి ఆర్.ఐ భాస్కర్, ఆర్.ఎస్.ఐలు నవీన్, భాను ప్రకాశ్, స్వాతి, పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధి శోభన్, గ్యాస్ విభాగం ఇంచార్జ్ ఓదేలుతో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే వాహనం సీజ్..


ఇటీవలే వాహన దారులు లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే సదరు వాహనాన్ని సీజ్ చేస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ వాహన దారులను హెచ్చరించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నియంత్రణతో పాటు క్రమశిక్షణతో కూడిన ట్రాఫిక్ ను కొనసాగించేందుకు సీపీ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ నెల 17వ తేది తర్వాత వాహన దారులు తమ వాహనాల నడిపేందుకు అవసరమయిన డ్రైవింగ్ లైసెన్సులను తప్పక కలిగి ఉండాలని సూచించారు. వాహనదారులు ఏవరైనా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపితే వారి వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడంతో పాటు వాహన యజమానిపై మోటార్ వెహికిల్ యాక్ట్ 180 మరియు 181 సెక్షన్ల కింద కేసులు పెడతామన్నారు. అలాగే కోర్టుకు తరలించి చార్జ్ షీట్ సమర్పిస్తామని వివరించారు. లైసెన్స్ లేని వాహనదారులు నూతనంగా రవాణా శాఖ నుండి పొందిన లర్నింగ్ లైసెన్స్ పత్రాలను పోలీస్ అధికారులకు సమర్పించిన తర్వాతే సీజ్ చేసిన వాహనాలను తిరిగి ఇస్తామన్నారు.