Elderly Couple Wedding in Mahabubabad District- వరంగల్: పెళ్లంటే నూరేళ్ల పంట. ఒకరికొకరు ఎంతో అన్యోన్యంగా కష్ట సుఖాల్లో తోడుండాలి అనుకుంటారు. ఇక్కడ జరుగుతున్న పెళ్లి ఓ స్పెషల్. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం కాదు. దశాబ్దాల క్రితమే ఒకరికి ఒకరు ఇష్టపడి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఆ సంబురాన్ని ఎనిమిది పదుల వయసులో కుమారులు కోడళ్లు, కూతుర్లు అల్లుళ్ళు, మనుమలు, మనుమరాలు సమక్షంలో మరోసారి వివాహం చేసుకున్నారు. దశాబ్దాల తరబడి ఆదర్శ వివాహ కుటుంబాన్ని కొనసాగించిన వృద్ధ దంపతులు హట్టహసంగా వివాహం చేసుకున్నారు. ఈ వివాహ వేడుక మహబూబాబాద్ జిల్లాలో జరిగింది.
దాదాపు 60 ఏళ్ల కిందట ప్రేమ వివాహం
దశాబ్దాల నుంచి ఒకరికొకరు తోడుగా వైవాహిక బంధాన్ని కొనసాగిస్తున్నారు వృద్ధ దంపతుల. పిల్లలు, మనుమల్లు, మనుమరాళ్ళు, మునిమనువల్లు, మనువరాళ్ల సాక్షిగా నూతన అలంకరనలు, మేళతాలాలు, వేద పండితుల మంత్రోచ్ఛరణలతో ఆ అవ్వా తాతల వివాహ వేడుక జరిగింది. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం వస్రాం తండా లో ఈ వేడుక కన్నుల పండుగ గా జరిగింది. తండాకు చెందిన ఎనభై సంవత్సరాల గుగులోతు సామిడా నాయక్, డెబ్భై అయిదు సంవత్సరాల వృద్ధులు దాదాపు 60 ఏళ్ల కిందట ఒకరినొకరు ఇష్టపడి వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. వీరికి నలుగురు కుమారులు ఒక కూతురు. కుమారులు, కూతురు కు వివాహం చేశారు. కుమారులు, కూతురుకు మనుమళ్ళు వచ్చారు.
అప్పట్లో గంధర్వ వివాహం, ఇప్పుడు కుటుంబసభ్యుల సమక్షంలో
యుక్త వయసులో ఒకరికి ఒకరు ఇష్టపడి గంధర్వ వివాహం చేసుకున్నారు. అప్పుడు మిస్సైన సంతోషాన్ని వేడుక లోటును పూడ్చడానికి ఆ వృద్ధ జంట అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఈ వృద్ధులు వివాహం చేసుకోలేదనే లోటు మా జీవితాల్లో ఉండకూడదని తమ పిల్లలకు తెలియచేయడంతో కొడుకులు, కూతుళ్లు, మనుమలు, ముని మనవళ్ళు, మనుమరాళ్లు , బంధుమిత్రులు, తండా వాసుల సమక్షంలో వృద్ధులకు హిందూ సంప్రదాయంగా వివాహం జరిపించారు. ఒకరి తలపై మరొకరు జీలకర్ర బెల్లం, మాంగల్య ధారణతో వివాహం చేసుకున్నారు. వివాహతంతు అనంతరం డీజే పాటలకు బంధువులు ఊర మాస్ స్టెప్పులతో అధరగొట్టి ఆహుతులను అలరించారు. బంధువులకు తండా వాసులకు రుచికరమైన విందు భోజనం పెట్టారు.
Also Read: Shamshabad ఎయిర్‌పోర్టులో చిరుత కలకలం- ట్రాప్ కెమెరా, బోన్లు ఏర్పాటు చేసిన అటవీశాఖ