Leopard Spotted near RGI Airport at Shamshabad- శంషాబాద్: రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో చిరుత కలకలం రేపింది. గొల్లపల్లి నుంచి ప్రహరీ గోడ దూకి శంషాబాద్ విమానాశ్రం ఏరియాలోకి చిరుత ప్రవేశించింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి వద్ద చిరుత ఎయిర్ పోర్ట్ ప్రహరీ గోడ దూకినట్లు అధికారులు గుర్తించారు. ఫెన్సింగ్ వైర్లకు తాకడంతో అలారమ్ మోగింది.
మోగిన ఎయిర్ పోర్ట్ కంట్రోల్ రూమ్ అలారం
చిరుతతో పాటు దాన్ని రెండు చిరుత పిల్లలు కూడా ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రహరీ గోడ దూకుతుండగా ఫెన్సింగ్ వైర్లకు చిరుత తగిలింది. ఈ క్రమంలో చిరుత ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ కి తగలడంతో ఎయిర్ పోర్ట్ కంట్రోల్ రూమ్ లో అలారం మోగడంతో సెక్యూరిటీ అధికారులు అప్రమత్తం అయ్యారు. అధికారులు సీసీ కెమెరాలను పరిశీలించగా చిరుత సంచరించినట్లు నిర్ధారణ అయింది.
చిరుత సంచారంపై ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ అధికారులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది ఆ చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చిరుత కదలికలను పరిశీలించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు ఏర్పాటు చేశారు. పులిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు ట్రాప్ కెమెరా, బోన్ లు ఏర్పాటు చేశారు.
Also Read: రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు - రేవంత్ వ్యాఖ్యలపై మోహన్ భగవత్ కౌంటర్