Warangal Ganesh Nimajjan: గణపతి లడ్డు అనగానే. లడ్డు దక్కించుకోవడం కోసం భక్తులు లక్షలు వెచ్చించి వేలంపాటలో పాల్గొంటారు. అలాంటిది లక్కీ డ్రా లడ్డు దక్కించుకోవడం అంతకంటే అదృష్టం మరొకటి ఉండదు. కానీ వరంగల్ లో ఓ శునకం లక్కీ డ్రాలో గణపతి లడ్డూను కైవసం చేసుకుంది.


హనుమకొండ నగరంలోని యూనివర్సిటీ డబ్బాల వద్ద హనుమాన్ భజన మండలి పేరుతో 28 సంవత్సరాలు గణపతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రతి సంవత్సరం లడ్డును వేలం పాట వేయకుండా 51 రూపాయలు చెల్లించి లక్కీ డ్రా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఈ సారి లక్కీ డ్రా నిర్వహించారు. హనుమాన్ నగర్ కాలనీకి చెందిన పోలాస వాణి, రాజేష్ దంపతులు కుటుంబ సభ్యుల పేర్లతో కూడా లక్కీ డ్రా లో పాల్గొన్నారు. 


వాణి, రాజేష్ దంపతులు ఓ శునకాన్ని పెంచుకుంటున్నారు. శునకానికి సోను అనిపేరు పెట్టారు. ఇంట్లో కుటుంబ సభ్యులతో సమానంగా సోనును వారు చూసుకుంటున్నారు. లడ్డూ లక్కీ డ్రాలో శునకం సోను పేరు మీద 28 కిలోల లడ్డు దక్కించుకుంది. దీంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేవు. శునకాన్ని గణపతి మండపం వద్దకు తీసుకువెళ్ళి లడ్డూను ఇంటికి తీసుకువచ్చారు.. ఇంటి యజమాని రాజేష్. మా సోను పేరు మీద లడ్డు గెలుచుకోవడం ఆనందంగా ఉందని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.


గత ఏడాది గణపతి ఉత్సవాల్లో వాణి, రాజేష్ దంపతుల కూతురు వర్ష పేరు మీద లక్కీ డ్రాలో లడ్డూ దక్కించుకున్నారు. ఈసారి వారి ఇంట్లో శునకం పేరు మీద లడ్డూ రావడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.