Maoists killed in encounter in Chhattisgarh | ఛత్తీస్ గఢ్‌లో మావోయిస్టుల కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. ఇటీవల దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్‌లో తొమ్మిది మంది మావోయిస్టులు మృతిచెందారు. అయితే వీరిలో మావోయిస్టు అగ్రనేత మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ @ దాదా రణదేవ్ దాదా ఉన్నారు. కేంద్ర మిలిటరీ ఇన్చార్జ్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్  బార్డర్ ఇంచార్జ్ గా వ్యవహరించిన ఏసోబు అలియాస్ జగన్ మృతిచెందినట్టు దంతేవాడ పోలీసులు ప్రకటించారు. మావోయిస్టు అగ్రనేత ఉమ్మడి వరంగల్ జిల్లా (Warangal District)కు చెందినవాడు కావడంతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి. అగ్రనేత స్వగ్రామం కాజీపేట మండలం టేకులగూడెం అని, ఇటీవల జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో జగన్ కూడా చనిపోయాడని దంతేవాడ ఎస్పీ తాజాగా ప్రకటించారు.


భారీ ఎన్‌కౌంటర్‌లో 9 మంది మావోయిస్టులు హతం: దంతేవాడ పోలీసులు


ఛత్తీస్ గఢ్‌లో ఆపరేషన్ మావోయిస్టుల లక్ష్యంగా బలగాలు కూంబింగ్ ను కొనసాగిస్తున్నాయి. భారీ వర్షాల సమయంలో మావోయిస్టులను ప్రాంతాలు మారుతున్నారు. ఈ క్రమంలో పోలీస్ బలగాల కూంబింగ్ కొనసాగించారు. రెండు రోజుల కిందట ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ తొమ్మిది మంది మావోయిస్టులు చనిపోయినట్టు దంతేవాడ పోలీసులు ధృవీకరించారు. ఛత్తీస్ గఢక్ రాష్ట్రంలోని దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో  మావోయిస్టుల కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు సమాచారం అందింది. దాంతో అప్రమత్తమైన పోలీస్ బలగాలు దంతెవాడ, బీజాపూర్ ప్రాంతంలోని అడవులను జల్లెడ పట్టారు. ఈ క్రమంలో పోలీస్ బలగాలకు మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో  తొమ్మిది మంది మావోయిస్టులు చనిపోయినట్టు దంతెవాడ పోలీసులు ధృవీకరించారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశంలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకొని, అనంతరం సైతం కూంబింగ్ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.


ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మావోయిస్టుల వివరాలు, వారిపై రివార్డ్ ఎంతంటే..
1. రణదేవ్ (మాచర్ల ఏసోబు అలియాస్ జగన్) పోస్ట్ DKSZCM, వరంగల్ నివాసిపై రివార్డు - రూ.25 లక్షలు
2. సుశీల మడకం, భర్త జగదీష్. పోస్ట్- ACM. రివార్డు - రూ.5 లక్షలు
3. కుమారి శాంతి, పోస్ట్- 31 PL సభ్యులు. రివార్డు - రూ.5 లక్షలు
4. కోసా మాద్వి, హోదా- మలంగిర్. ఏరియా కమిటీ పార్టీ సభ్యుడు - రివార్డు- రూ.5 లక్షలు.
5. గంగి ముచకి, హోదా- కాటేకల్యాణ్ ఏరియా కమిటీ సభ్యుడు - రివార్డు-రూ.5 లక్షలు.
6. లలిత, పోస్ట్- DVCM సురక్షా దళ్ సభ్యుడు, రివార్డు - రూ.5 లక్షలు.
7. కవిత, పోస్ట్ గార్డ్ ఆఫ్ AOBSZCగా ఉన్నారు, ఆమెపై రివార్డు - రూ.5 లక్షలు.
8. కమలేష్. ప్లాటూన్ మెంబర్- బీజాపూర్ నివాసి, రివార్డ్ - రూ. 2లక్షల
9. హిడ్మే మంకం, DVCM సురక్షా దళ్ సభ్యుడు, రివార్డు - రూ.2 లక్షలు 


Also Read: US News: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం- న‌లుగురు భార‌తీయుల దుర్మ‌ర‌ణం- మృతుల్లో ముగ్గురు తెలుగువారే   


Also Read: Kolkata: నేను అత్యాచారం చేయలేదు, హత్య మాత్రమే చేశా - లై డిటెక్టర్ టెస్ట్‌లో కోల్‌కతా కేసు నిందితుడు