KCR Public Meeting At Jangon: 
జనగామ: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు కొన్ని జిల్లాలకు వెళ్తే కళ్ల వెంట నీళ్లు వచ్చేవని అప్పడు జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల పరిస్థితి చూస్తే ఏడుపొచ్చేదంటూ సీఎం కేసీఆర్ గుర్తుచేసుకున్నారు.  హైదరాబాద్‌కు సమీపంలో ఉంది కనుక జనగామ అభివృద్ధికి అవకాశాలు ఉంటాయన్నారు. జనగామలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ జనగామ జిల్లాకు వరాల జల్లులు కురిపించారు.


బీఆర్ఎస్ జనగామ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపిస్తే చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేస్తామన్నారు. పాత వరంగల్‌ జిల్లాలో అత్యధికంగా వరి పండించే తాలూక జనగామ అని పేర్కొన్నారు. త్వరలోనే చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా చేస్తామని ప్రకటించారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించిన తరువాత ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లో రెవెన్యూ డివిజన్‌గా చేస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. జనగామలో మెడికల్‌ కాలేజీతో పాటు నర్సింగ్‌, పారా మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. జనగామ, భువనగిరి గ్రోత్‌ కారిడార్‌లుగా మారాయన్నారు కేసీఆర్. 


‘జనగామ భవిష్యత్‌లో ఐటీ, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి చెండానికి అవకాశం ఉంది. గతంలో బచ్చన్నపేటకు వెళ్తే ఊరిలో ఒక్క యువకుడు కూడా కనిపించలేదు. ఉపాధి కోసం వాళ్లు వలస వెళ్లారు. ఇప్పుడు బచ్చన్నపేటలో ఏడాది మొత్తం నీళ్లు ఉంటున్నాయి. రాష్ట్రం ఏర్పాటయ్యాక పలు రంగాల్లో తెలంగాణను అభివృద్ధి బాట పట్టించాం. ధాన్యం ఉత్పత్తిలో దేశంలో పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాం. రైతులకు తమ భూమిపై పూర్తి హక్కులు ఉండాలని ధరణి పోర్టల్ తెచ్చాం. కాంగ్రెస్ లాంటి ప్రభుత్వాలు రైతులు తమ భూమిపై అధికారం కోల్పోతారు. కనుక ఓటు హక్కును సద్వినయోగం చేసుకోండి. ప్రజాస్వామ్యంలో ఓటు బలమైన ఆయుధం. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించుకునే వారికి ఓటు వేయాలని’ సీఎం కేసీఆర్ జనగామ ప్రజలను కోరారు.


ధరణి పోర్టల్‌ను తీసేయాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తోంది. కనుక వారిని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలి. రైతుల కోసం ఉచిత కరెంట్ ఇస్తుంటే, కాంగ్రెస్ వాళ్లు మాత్రం వ్యవసాయానికి 3 గంటల కరెంట్ చాలని చెబుతున్నారు. మేనిఫెస్టోలో చెప్పినట్లుగా 93 లక్షల మందికి కేసీఆర్‌ బీమా అమలు చేస్తామన్నారు. రైతుబీమా తరహాలేనే వ్యక్తి చనిపోతే వారంలోనే రూ.5 లక్షల నగదు ఇస్తాం, ఈ ఎన్నికల్లో గెలవగానే రేషన్‌ కార్డు దారులకు సన్నబియ్యం ఇవ్వడంతో పాటు అన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పారు.


తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోమవారం మరో 28 మంది బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేశారు. దాంతో ఇప్పటివరకూ బీ ఫారాలు అందుకున్న బీఆర్ఎస్ అభ్యర్థుల సంఖ్య 97కు చేరింది. జనగామలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తున్నారు. 


1. సంజయ్ కల్వకుంట్ల
2. డా. ఎన్ . సంజయ్ కుమార్
3. కొప్పుల ఈశ్వర్
4. కోరుకంటి చందర్
5. పుట్ట మథు
6. చింత ప్రభాకర్
7. చామకూర మల్లారెడ్డి
8. కె పి వివేకానంద్
9. మాధవరం కృష్ణారావు
10. మంచికంటి కిషన్ రెడ్డి
11. సబితా ఇంద్రారెడ్డి
12. టి. ప్రకాశ్ గౌడ్
13. కాలె యాదయ్య
14. కొప్పుల మహేశ్ రెడ్డి
15. మెతుకు ఆనంద్
16. ముఠా గోపాల్
17. కాలేరు వెంకటేశ్
18. దానం నాగేందర్
19. మాగంటి గోపీనాథ్
20. టి. పద్మారావు
21.  లాస్య నందిత
22. గొంగిడి సునీత
23. శానంపూడి సైదిరెడ్డి
24. డి.ఎస్.రెడ్యానాయక్
25. బానోత్ శంకర్ నాయక్
26. చల్లా ధర్మారెడ్డి
27. ఆరూరి రమేశ్
28. గండ్ర వెంకట రమణారెడ్డి