వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. వైఎస్‍ఆర్‍ తెలంగాణ పార్టీ ప్రతినిధులు, లీగల్‍ సెల్‍ బృంద అభ్యర్థనపై పదిరోజులపాటు చర్చలు జరిపిన పోలీసులు చివరకు నో చెప్పారు. షర్మిల పాదయాత్ర చేస్తే లా అండ్ ​ఆర్డర్‌ సమస్య వస్తుందని కారణంగా చూపించారు. 


పాదయాత్రలో భాగంగా నవంబర్‍ 26న వరంగల్‍ జిల్లా నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​ రెడ్డిపై ఆయన సొంత ఊరు నల్లబెల్లిలో షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. 28న షర్మిల యాత్రపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడి చేశారు. అక్కడ వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో రాజకీయ దుమారం చెలరేగింది. 


దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. శాంతిభద్రతల సమస్య కారణంగా లింగగిరి శంకరమ్మ తండా వద్ద షర్మిల పాదయాత్రకు బ్రేక్ వేశారు. ఆమెను అరెస్టు చేసి హైదరాబద్ తరలించారు. తర్వాత హైదరాబాద్‌లో జరిగిన హైడ్రామా అందరికీ తెలిసిందే. పరిస్థితి చల్లబడినందు పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని వైఎస్‌ఆర్టీపీ హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. సంప్రదించింది. 


పాదయాత్రకు పర్మిషన్‌ ఇవ్వలని కోరుతూ వైఎస్‍ఆర్‍టీపీ లీడర్లు 29న హైకోర్ట్ గడప తొక్కారు. ఈ సందర్భంగా  కొన్ని షరతులతో పాదయాత్ర చేసుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. పార్టీ వర్గాలు యాత్రకు ఏర్పాట్లు చేసుకుంటుండగా పోలీసులు మళ్లీ అనుమతి నిరాకరించారు.


పార్టీ లీగల్ టీం కి సైతం షాక్






డిసెంబర్‍ 4న షర్మిల పాదయాత్రకు పర్మిషన్‍ ఇచ్చే విషయమై సమాధానం చెప్పాలంటూ షోకాజ్‍ నోటీసులు ఇచ్చారు. 5న పార్టీ వరంగల్‍ జిల్లా లీడర్లు, పార్టీ లీగల్‍ సెల్‍ బృందం వరంగల్‍ కమిషనర్​ రంగనాథ్‍ను కలిసి వివరణ ఇచ్చారు. 48 గంటల్లో నిర్ణయం చెబుతామనగా గురువారం మధ్యాహ్నం  కమిషనరేట్‍కు వెళ్లి  సీపీని కలవగా సాయంత్రం రమ్మన్నారు. 5 గంటలకు వెళ్లగా..అనుమతి అంశాన్ని మరో అధికారికి అప్పజెప్పారనే సమాధానం వచ్చింది. దీంతో రాత్రి 9 గంటల వరకు వేచి చూశారు. చివరకు అర్ధరాత్రి వైఎస్సార్ టీపీ లీడర్ కు నర్సంపేట పోలీసులు పర్మిషన్ ఇవ్వలేమంటూ రిజెక్ట్ లెటర్ ఇచ్చారు. దీంతో మరోసారి హైకోర్టును ఆశ్రయించేందుకు రెడీ అవుతున్నారు వైఎస్‌ఆర్టీపీ లీడర్లు.