Pawan Kalyan Emotional Tweet On His Fan Niranjan Death : వరంగల్‌కు చెందిన తన వీరాభిమాని నిరంజన్ మృతి పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ... ఎమోషనల్ ట్వీట్ చేశారు.

Continues below advertisement

'నా హృదయంలో నిలిచిపోతాయి'

ప్రియమైన నిరంజన్... నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయంటూ పవన్ కల్యాణ్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. 'కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.

Continues below advertisement

అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం. నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ప్రియమైన నిరంజన్… నువ్వు చూపించిన చిరునవ్వు,  ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.' అని ట్వీట్ చేశారు.

Also Read : Pawan Kalyan Fan Dies: పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!

చివరి కోరిక తీరకుండానే...

వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన పొనుగంటి నిరంజన్ (17) పవన్ కల్యాణ్‌కు వీరాభిమాని. గత కొన్నేళ్లుగా అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధ పడుతున్న నిరంజన్ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచాడు. చిన్నప్పుడు ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేసే బాలుడు వ్యాధి కారణంగా శారీరక ఎదుగుదల లోపించి చిన్న పిల్లాడిలా కనిపిస్తూ మంచానికే పరిమితమయ్యాడు. పవన్‌ను చూడాలనేది తన ఆఖరి కోరిక అని చెప్పాడు.

ఈ విషయం తెలుసుకున్న పవన్... నిరంజన్ పరిస్థితి చూసి చలించిపోయారు. స్వయంగా అభిమాని ఇంటికి వెళ్లి చేతిని ముద్దాడుతూ పరామర్శించారు. చిన్నప్పటి నుంచి తానంటే నిరంజన్‌కు ఎంత అభిమానమో స్వయంగా చూశారు. నిరంజన్ కోసం తిరుపతి నుంచి ప్రసాదం, పట్టు వస్త్రాలు తెచ్చి అందించారు. అతని కోరిక మేరకు కుటుంబానికి సైతం ఆర్థిక సాయం అందించారు. రామ్ చరణ్ దగ్గర ఉన్న కుక్క పిల్ల కావాలని అడగ్గా గంటల్లోనే అందేలా చేశారు. నిరంజన్‌తో సెల్ఫీ దిగుతూ 'OG 2' తీస్తే నువ్వే స్పెషల్ గెస్ట్ అని చెప్పారు పవన్. అయితే, ఆ కోరిక తీరకుండానే నిరంజన్ కన్నుమూశారు.

Also Read : Babu Mohan : ప్రస్తుతం 15 మూవీస్ చేస్తున్నా - అలాంటి రోల్స్‌కు నో... శ్రీవారి సేవలో బాబు మోహన్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.