Pawan Kalyan Fan Nirajan Dies | హనుమకొండ: ఏపీ డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్ కళ్యాణ్ వీరాభిమాని పొనుగంటి నిరంజన్ (17) మృతిచెందాడు. గత కొన్నేళ్లుగా యువకుడు నిరంజన్ ఒక అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. చిన్నప్పుడు ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేసే నిరంజన్ ఈ వ్యాధి కారణంగా శారీరక ఎదుగుదల లోపించి, ఆపై పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన నిరంజన్‌ను పవన్ ఇటీవల కలిసి పరామర్శించారు. ఇటీవల నిరంజన్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం అతడ్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి నిరంజన్‌ తుదిశ్వాస విడిచినట్లు సమాచారం.

Continues below advertisement

తన అభిమాన నటుడు చూడాలనే వీరాభిమాని నిరంజన్ ఆఖరి కోరికను తెలుసుకున్న పవన్ కల్యాణ్ చలించిపోయారు. గత జూన్ నెలలోనే స్వయంగా హనుమకొండకు వెళ్లి మరీ అభిమాని నిరంజన్‌ను పరామర్శించారు. ఆ సమయంలో ఎంతో ఆత్మీయంగా నిరంజన్‌ను పలకరించారు పవన్. నిరంజన్ చేతిని ముద్దాడిన పవన్ తన అభిమానికి తిరుపతి నుంచి ప్రసాదం, పట్టువస్త్రాలు తెప్పించి అందించారు. రామ్ చరణ్ వద్ద ఉన్న కుక్కపిల్ల కావాలన్న అతడి కోరికను గంటల వ్యవధిలో నెరవేర్చి గొప్ప మనసు చాటుకున్నారు పవన్ కళ్యాణ్. నిరంజన్ కోరిక మేరకు ఆ కుటుంబానికి సైతం పవన్ కళ్యాణ్ ఆర్థికసాయం చేసి అండగా నిలిచారు.Also Read: Pawan Kalyan: హనుమకొండలో పవన్ కల్యాణ్... అభిమాని చిరకాల వాంఛ నెరవేర్చిన ఏపీ డిప్యూటీ సీఎం

Continues below advertisement

ఓజీ 2కి స్పెషల్ గెస్ట్‌ అని మాటిచ్చిన పవన్ కళ్యాణ్..ఈ ఆత్మీయ కలయికలో పవన్ కల్యాణ్ తన అభిమాని నిరంజన్‌తో సెల్ఫీలు తీసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ ఆసక్తికరమైన మాట చెప్పారు. 'OG 2' సినిమా తీస్తే.. ఆ సినిమాకు నువ్వే నా స్పెషల్ గెస్ట్ అని... మనమిద్దరం కలిసి ఆ సినిమా చూద్దాం అని నిరంజన్‌కు జనసేనాని మాటిచ్చారు.

తన అభిమాన నటుడిని చూడాలని ఎన్నో ఏళ్లుగా ఉన్న కల నేరవేర్చుకున్న నిరంజన్ కొన్నిరోజుల్లోనే ప్రాణాలు కోల్పోవడం పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన శ్రేణులను కలచివేస్తోంది. నిరంజన్ మృతి పట్ల సోషల్ మీడియాలో పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.