Telangana News: దేశంలో మావోయిస్టు పార్టీ ఏర్పడి 20 వసంతాలు పూర్తి చేసుకున్న వేళ నెలరోజులపాటు వసంతోత్సవాలు నిర్వహించుకుంటుంది మావోయిస్టు పార్టీ. నేటితో ముగుస్తున్నాయి. ఇదిలా ఉంటే దేశంలో పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ ఇవాళ్టి నుంచి వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. అందుకే అక్టోబర్ 21వ చాలా స్పెషల్ డే గా నిలిచిపోతోంది.
పోలీస్ త్యాగాలకు గుర్తుగా...
తెలుగు రాష్ట్రాల్లో అక్టోబర్ 21 చాలా ప్రత్యేక రోజు. దేశంలో తీవ్రవాద సంస్థలు, దేశ రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్‌లు ప్రాణాలు కోల్పోతున్నారు. వారిని స్మరించుకోవడం కోసం అక్టోబర్ 21న అమరవీరుల సంస్కరణ దినంగా జరుపుకుంటారు. ఈ పేరు వినగానే మావోయిస్టు దాడుల్లో మృతి చెందిన పోలీసులు గుర్తుకొస్తారు. అందుకే వారిని స్మరించుకొని వారి సేవలు ప్రశంసించుకుంటున్నారు. మావోయిస్టు పార్టీ ఆవిర్భవించింది అక్టోబర్ 21 నాటికి 20 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నెల రోజుల పాటు 20 వసంతాల వేడుకలు జరుపుకుంటుందా పార్టీ.
మావో 20 వసంతోత్సవాలు...
దేశంలో 2 ప్రధాన ఎంఎల్ గ్రూపులు 2004 వరకు కార్యకలాపాలను కొనసాగించాయి. ఒకటి పశ్చిమ బెంగాల్‌లో దక్షిణ్ దేశ్‌గా ప్రారంభమైన ఎంఎల్ గ్రూప్ 1975లో మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్‌గా ఆవిర్భవించింది. మరొకటి 1972లో ఏపీలోని శ్రీకాకుళంలో ఎంఎల్ పార్టీ కార్యకలాపాలు మొదలయ్యాయి. 1978లో జగిత్యాల జైత్రయాత్ర ఉద్యమం భూస్వామ్య వ్యవస్థపై సుమారు నలభై వేలమంది ఈ ఉద్యమాల్లో పాల్గొన్నారు. దీంతో 1980లో తెలంగాణ కేంద్రంగా పీపుల్స్ వార్ పార్టీ ఏర్పడింది.
జగిత్యాల జైత్రయాత్ర ఊత మివ్వడంతో పీపుల్స్ వార్ పార్టీ ఆంధ్రప్రదేశ్, మహరాష్ట్ర, తమిళనాడులో కమిటీలు వేసి కార్యకలాపాలు కొనసాగించింది. సౌత్ ఇండియాలో పీపుల్స్ వార్ పార్టీ విస్తరించడంతోపాటు అతిపెద్ద ఎంఎల్ గ్రూప్‌గా కార్యకలాపాలను కొనసాగించి ప్రజలకు దగ్గరైంది. 2004 సెప్టెంబర్ 21న పీపుల్స్ వార్, మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్‌లు కలిసి దేశంలో ప్రధాన ఎం ఎల్ గ్రూప్‌గా మావోయిస్టు పార్టీ ఆవిర్భవించింది. ఇరవై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 21 వరకు నెల రోజుల పాటు వేడుకలను జరుపుకుంటుంది.
21 అక్టోబర్ పోలీస్ అమర వీరుల దినోత్సవం
1959 అక్టోబర్ 21వ తేదీన పోలీస్ అమరవీరుల దినోత్సవం ప్రారంభమైంది. అదే రోజు పంజాబ్ రాష్ట్రానికి చెందిన 21 మందితో కూడిన సీఆర్‌పీఎఫ్ దళం భారత్, చైనా సరిహద్దుల్లో గస్తీ నిర్వహిస్తుంది. ఇదే సమయంలో చైనా బలగాలకు, సీఅర్పీఎఫ్ బలగాలకు కాల్పులు జరిగాయి. ఈ దుర్ఘటనలో 10 మంది సీఅర్పిఎఫ్ జవాన్లు మృతి చెందారు. వారి త్యాగాలకు గుర్తుగా 21 వ తేదీన పోలీస్ అమర వీరుల సంస్మరణ కార్యక్రమం జరుపుకోవడం మొదలైంది. దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల పోలీస్ అమర వీరులను స్మరించుకోవడం జరుగుతుంది. కేంద్ర, రాష్ట్ర బలగాలు మావోయిస్టు ఏరివేతకులో భాగంగానే అమరులయ్యారు.
సంస్మరణ దినం-ఆవిర్భావ వేడుకల ముగింపు
పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమం, మావోయిస్టు పార్టీ 20 వసంతాల వేడుకల ముగింపు 21న రావడం ప్రత్యేకత సంతరించుకుంది. ఒకరు వృత్తిపరంగా శాంతిభద్రతలను కాపాడడం కోసం అమరులైన పోలీసులను స్మరించుకుంటే... సమ సమాజ స్థాపన కోసం ఆవిర్భవించిన మావోయిస్టు పార్టీ 20 వసంతాలు వేడుకలు చేసుకుంటుంది.