Jangaon BRS: జనగామ బీఆర్ఎస్ టికెట్పై ఉత్కంఠ వీడింది. హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్ లో పల్లా, ముత్తిరెడ్డి మధ్య సయోధ్య కుదిరింది. నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ కార్యకర్తలతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించుకోవాలని మంత్రి దిశా నిర్దేశం చేశారు. జనగామ టికెట్ ఆశావాహి మండల శ్రీరాములు, మరో ఆశావాహి కిరణ్ కుమార్ గౌడ్ ను కూడా పిలిపించి భవిష్యత్ లో అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఆర్టీసీ చైర్మన్ పదవి ఇవ్వడంతో ముత్తిరెడ్డి మెత్తబడ్డారు.
కేసీఆరే బీఆర్ఎస్ బలం, ముచ్చటగా మూడోసారి గెలుపు ఖాయామా ?
బీఆర్ఎస్ తొలి జాబితాలో చోటు దక్కని నియోజకవర్గాల్లో జనగామ కూడా ఒకటి. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి మరోసారి టికెట్ ఖరారు కాకపోవడంతో ఆయన అలకబూనారు. అయితే అవకాశం ఎక్కడికీ పోలేదని అనుచరులకు సర్దిచెబుతూ వచ్చారు. తీరా ఆయన్ను ఆర్టీసీ చైర్మన్ గా నియమించే సరికి జనగాన ఎమ్మెల్యే టికెట్ రాదని క్లారిటీ వచ్చేసింది. అయినా కూడా తానే బరిలో ఉంటానంటూ చెబుతున్నారు ముత్తిరెడ్డి. చివరకు ఈ పంచాయితీ మంత్రి కేటీఆర్ వద్దకు చేరింది. ముత్తిరెడ్డితోపాటు, జనగామ టికెట్ ఆశిస్తున్న మండల శ్రీరాములు, కిరణ్ కుమార్ గౌడ్ ని కూడా పిలిపించి మాట్లాడారు కేటీఆర్. ఈసారి టికెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి కేటాయిస్తున్నట్టు స్పష్టం చేశారు.
తెలంగాణ హైకోర్టులో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు ఊరట- ఎన్నిక చెల్లదన్న పిటిషన్ డిస్మిస్
జనగామ టిక్కెట్ కోసం బీఆర్ఎస్ లో మొదటి నుంచి భారీ పోటీ ఉంది. పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే టిక్కెట్లు ఖరారు చేసే ముందు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరు తెరమీదకు వచ్చింది. పోచంపల్లి, పల్లాలు ఎవరికీ వారుగా ప్రయత్నాలు చేసినా.. రాజేశ్వర్‌రెడ్డి వైపు కేసీఆర్ మొగ్గారు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పలు వివాదాల్లో కూరుకుపోవడంతో ఆయనను మార్చాలని నిర్ణయించుకున్నారు. అయితే ముత్తిరెడ్డి తనకే అవకాశం కల్పించాలని చాలా గట్టి ప్రయత్నాలు చేశారు. అయితే ముత్తిరెడ్డి వెంట తిరిగిన వారు ఒక్కసారిగా విబేధించి పల్లా పంచన చేరడంతో ముత్తిరెడ్డి రాజీపడిపోయారు. ఆర్టీసీ చైర్మన్పదవి అంగీకరించడంతో పల్లా పేరు ప్రకటన లాంఛనం అయింది.
మొత్తం 115 అసెంబ్లీ నియోజకవర్గాల టిక్కెట్లను ప్రకటించినా కేవలం నాలుగు మాత్రమే పెండింగ్ ఉంచారు. వాటిలో ్భ్య్రథుల్ని ఖరారు చేసినా ... సిట్టింగ్ ఎమ్మెల్యేలను బుజ్జగించడానికి.. కొంత సమయం తీసుకున్నారు. రేఖానాయక్ వంటి వాళ్లు రాజీనామా చేశారు. మిగిలిన వారిని బుజ్జగించి ఏదో ఓ పదవి ఇస్తున్నారు. ఇక నర్సాపూర్ లో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డికి టిక్కెట్ కేటాయించాలనుకుంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ని బుజ్జగించేందుకు బీఆర్ఎస్ హైకమాండ్ ప్రయత్నిస్తోంది.