తీన్మార్ మల్లన్నను జనగాం పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్‌లో రైతుల కష్టాలు తెలుసుకునేందుకు వెళ్తుండగా తెల్లవారుజామున మార్గమధ్యంలో అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అనంతరం ఆయన్ని లింగాల ఘనపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వరంగల్‌లో ల్యాండ్ పూలింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా ఆయన వెళ్లారు. ఆయనతోపాటు ఆయన టీమ్ కూడా వెళ్తోంది. అక్కడ పెద్ద ఎత్తున ఆందోళనలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అందుకే ముందస్తు అరెస్టులు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఆయన అనుచరులను కూడా అదుపులోకి తీసుకున్నారు.
Teenmar Mallanna: లింగాల ఘనపూర్ వెళ్తున్న తీన్మార్ మల్లన్న అరెస్టు
ABP Desam | 10 May 2022 08:48 AM (IST)
వరంగల్ వెళ్తున్న తీన్మార్ మల్లన్నను పోలీసులు అరెస్టు చేశారు. లింగాలఘనపూర్ వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు.
తీన్మార్ మల్లన్న అరెస్టు