వరంగల్ : తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ అధికారులు తమ దాడులను విస్తృతం చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులను వల పని పట్టుకుంటున్నారు. తాజాగా జనగామ జిల్లాలో ఓ పంచాయతీ కార్యదర్శి ఏసీబీ వలకు చిక్కాడు. లంచం రూ.4,500 తీసుకుంటుండగా రఘునాథపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతోష్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మండల కేంద్రమైన రఘునాథపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పేర్ని మల్లేష్ తమ ఇంటి అనుమతి విషయమై పంచాయతీ కార్యదర్శి సంతోష్ ను సంప్రదించాడు. అయితే ఈ పని చేసేందుకు కార్యదర్శి సంతోష్ పెద్ద మొత్తంలో లంచం డిమాండ్ చేశాడు. 
చివరకు లంచం రూ.4,500 ఇచ్చేందుకు ఒప్పుకున్న మల్లేశ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారిచ్చిన ప్లాన్ ప్రకారం బుధవారం రఘునాథపల్లిలో మల్లేష్ లంచం రూ.4,500 ఇవ్వగా తీసుకుంటున్న కార్యదర్శి సంతోష్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ కేసులో ఏసీబీ అధికారులు ఇదే గ్రామ పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది నగేష్ ను కూడా ట్రాప్ చేసి పట్టుకున్నారు. సంతోష్, నగేష్ ను విచారించారు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. వరుసగా జరుగుతున్న ఏసీబీ దాడులు కలకలం రేపుతున్నాయి.


హైదరాబాద్‌లో వరుస చోరీలు.. 
నవంబర్ 24న రాత్రి నారాయణగూడలో డివినిటి ఆభరణాల షాపు నుంచి వెళ్తున్న ఉద్యోగిని సైతం కళ్లల్లో కారం కొట్టి 25 తులాల బంగారు నగలున్న బ్యాగుతో ఉడాయించారు. ఒక్క రోజు వ్యవధిలోనే ఈ రెండు ఘటనలు చోటు చేసుకోగా అటు నారాయణగూడ క్రైం పోలీసులకు, ఇటు జూబ్లీహిల్స్ క్రైం పోలీసులకు ఈ ముఠాను పట్టుకోవడం సవాల్‌గా మారింది. రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ గత మూడు రోజుల నుంచి సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు ఈ ముఠా స్నాచింగ్లకు పాల్పడుతున్న తీరు, వీరి కదలికల ఆధా రంగా నిందితులు మహారాష్ట్రకు చెందిన ఇరానీ గ్యాంగ్ గుర్తించారు. గతంలోనూ వీరు స్నాచింగ్ చేసిన పద్ధతులను కూడా పరిశీలించారు. నెంబర్ ప్లేట్ లేని బైక్పై మంకీ క్యాపులు ధరించిన ఇద్దరు యువకులు ఈ చోరీలకు పాల్పడినట్లుగా నిర్ధారణకు వచ్చారు. 
నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ సీసీ ఫుటేజీలను పరిశీ లించగా ఈ రెండు స్నాచింగ్లు వీరిద్దరే చేసినట్లుగా తేలింది.ఈ ముఠా కోసం జూబ్లీహిల్స్, పంజాగుట్ట, నారాయణగూడ క్రాంపోలీసులతో పాటు వెస్ట్, సెంట్రల్ జోన్ టాస్క్ పోర్స్ పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి గాలింపు ముమ్మరం చేశారు. గతంలో స్నాచింగ్ కు పాల్పడిన ఇరానీ గ్యాంగ్ వేలి ముద్రలను, ఫొటోలను పరిశీలిస్తున్నారు. సికింద్రాబాద్, పంజగుట్ట ప్రాం తాల్లో లాడ్జీల్లో బస చేసిన ఇతర ప్రాంతాల వారి వివరాలను రాబడుతూ అక్కడ సీసీఫుటేజీలు పరిశీలిస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్యోగి నుంచి బ్యాగు లాక్కొని తస్క రించగా అందులో కేవలం తాళం చెవులు మాత్రమే ఉండటంతో ఆ బ్యాగును నగల దుకాణం వద్ద విసిరేసి పరారైనట్లుగా సీసీ ఫుటేజీలు స్పష్టం చేస్తున్నాయి. 
నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మాత్రం బ్యాగులో 25 తులాల బంగారు ఆభరణాలు ఉండగా బాధితుడు జితేంద్ర శర్మ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ప్రధాన రహదారుల్లో సీసీ పుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు. ఈ గ్యాంగ్ ఎక్కడా క్షణం కూడా నిలబడకుం డా దూసుకుపోతున్నట్లు తేలింది. ఇంకోవైపు మంకీ క్యాంప్ ధరించడంతో ముఖ ఆనవాళ్లు గుర్తించలేకపోతున్నారు. బైక్ నెం బర్ ప్లేట్లు కూడా తొలగించడంతో కేసు దర్యాప్తు జఠిలంగా మారిందని ఓ అధికారి తెలిపారు. అయితే పాత నేరస్తుల కద లికలపై దృష్టి పెట్టిన పోలీసులు మరో రెండు, మూడు రోజుల్లో ఈ గ్యాంగ్ను పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.