Hanmakonda Crime News: పనిమీద బయటకు వెళ్లింది. అప్పటికే చాలా ఆలస్యం అవడంతో.. కనిపించిన ఓ ఆటో డ్రైవర్ ను సేఫ్ గా ఇంటికి తీసుకెళ్లాలని బతిమాలింది. దీంతో ఆటో ఎక్కించుకున్న అతడు.. మృగంలా మారాడు. తన స్నేహితులైన మరో ఇద్దరు ఆటో డ్రైవర్లకు ఫోన్ చేయగా.. వారు కూడా వచ్చి ఆటో ఎక్కారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆటోలో ఫుల్లుగా పాటలు పెట్టి మరీ ఒకరి తర్వాత ఒకరు సదరు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. హన్మకొండ జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


అసలేం జరిగిందంటే..?


హన్మకొండ నయీంనగర్ సమీపంలో నివసిస్తున్న ఓ వివాహిత ఏప్రిల్  2వ తేదీన పని మీద బయటకు వెళ్లి రాత్రి 12 గంటల సమయంలో ఇంటిరి తిరిగి వస్తున్నారు. అర్ధరాత్రి కావడంతో కేయూ క్రాస్ వద్ద రోడ్డుపై వెళ్తున్న ఆటోను ఆపి తనను రంగ్ బార్ వద్ద దింపాలని డ్రైవర్ ను కోరారు. మహిళను ఆటో ఎక్కించుకు్నన డ్రైవర్ రాకేశ్.. తన స్నేహితులైన ఆటో డ్రైవర్లు సనత్, సతీష్ కు ఫోన్ చేయగానే కొద్ది సేపటికే వాళ్లు కూడా వచ్చి ఆటో ఎక్కారు. ఆటోను మహిళ చెప్పిన చోటుకు కాకుండా మరో చోటుకు తీసుకెళ్లడం గమనించిన మహిళ అరవడం ప్రారంభించింది. అయితే అరిస్తే ప్రాణాలు తీస్తామంటూ రాకేశ్ స్నేహితులు బెదిరించారు. దీంతో నోరు మెదపకుండా ఆమె ఆటోలో కూర్చుండగా.. ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. 


భీమారం గ్రామ శివారు వద్ద ఎవరూ లేని చోట ఆటో ఆపారు. ఆమెను కిందకు దంపి ఆటో సౌండ్ బాక్స్ శబ్దాన్ని బాగా పెంచారు. అనంతరం ఒకరి తర్వాత మరొకరు సదరు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను రంగ్ బార్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లిన మహిళ బంధువులకు విషయం తెలపడంతో... హన్మకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి మహిలళకు వైద్య పరీక్షలు చేయించారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు హన్మకొండ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ జీ తెలిపారు. 


గతేడాది డిసెంబర్ లో మహబూబాబాద్ లో...!


మృగాళ్ల చేతిలో నిత్యం ఆడబిడ్డల బతుకులు తెల్లారిపోతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ మృగం వరసకు కూతురు అయ్యే చిన్నారిపై లైంగిక దాడి చేశాడు. మరో ఇద్దరు కూడా బాలికపై దారుణానికి పాల్పడ్డారు. ఆ తర్వాత అత్యంత దారుణంగా హత్యచేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగి ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని ఓ గ్రామంలో పదో తరగతి బాలికపై సొంత బాబాయ్ మరో ఇద్దరితో కలిసి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాలికను హత్య చేశారు. బాలిక తల్లిదండ్రులు ఉపాధి కోసం హైదరాబాద్‌ కు వెళ్లడంతో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. దీంతో బాలికపై కన్నేసిన బాబాయ్ శ్రీనివాస్ తన స్నేహితులతో కలిసి బాలికపై దారుణానికి పాల్పడ్డాడు. బాలిక ప్రతిఘటించడంతో హత్య చేసి పరారయ్యారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.