Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - త్వరలోనే పనులు ప్రారంభం
Mamanoor Airport: వరంగల్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి కేంద్రం అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే భూసేకరణకు కావాల్సిన నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.

Good News For Warangal: వరంగల్ వాసుల ఎయిర్ పోర్టు కల ఫలించబోతోంది. కేంద్రం అధికారికంగా మామునూరు ఎయిర్ పోర్టును పునరుద్ధరించడానికి ఆదేశాలు జారీ చేసింది. రన్ వే నిర్మాణానికి అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇస్తే చాలు... పనులు ప్రారంభిస్తారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు అవసరమైన నిధులను విడుదల చేసింది. ఇప్పటికే పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ సూచనల మేరకు భూసేకరణ ప్రక్రియ ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం కొద్ది రోజుల కిందటే మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ మేరకు అధికారులు భూసేకరణ ప్రక్రియ కూడా ప్రారంభఇంచారు.
ఎయిర్‌స్ట్రిప్‌ను ఎయిర్ పోర్టుగా అభివృద్ధి
మామూనూరులో ప్రస్తుతం ఎయిర్ స్ట్రిప్ ఉంది. తొలి దశలో చిన్న విమానాల రాకపోకలకు వీలుగా 253 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించింది. అదు కోసం రూ. 205 కోట్ల రూపాయల నిధుల్ని కేటాయించారు. తెలంగాణలో ప్రస్తుతం శంషాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కటే ఉంది. పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా మరో 6 చోట్ల ప్రాంతీయ విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కారు కొన్నేళ్లుగా కసరత్తు చేస్తోంది. ఆ ఆరు ప్రాంతాలను ఏఏఐ అధ్యయనం చేసి సాధ్యాసాధ్యాలపై సుముఖత వ్యక్తం చేస్తూ.. ఇటీవల ప్రాథమిక నివేదిక ఇచ్చింది.
భూసేకరణ చివరి దశకు
ఈ మేరకు తొలి దశలో వరంగల్ లో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని పట్టుదలతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం... ఏఏఐ అధికారులతో కొద్ది నెలలుగా సంప్రదింపులు జరుపుతోంది. తాము సూచించిన అదనపు భూమిని కేటాయిస్తే నిర్మాణ వ్యవహారాలను మొదలు పెడతామని ఇప్పటికే లేఖలు రాశారు. ఇప్పుడు భూసేకరణ చివరి దశకు రావడంతో కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
అంతా కేంద్రానిదే ఖర్చు
వరంగల్ జిల్లా మామునూరులో హైదరాబాద్ చివరి నిజాం 706 ఎకరాల విస్తీర్ణంలో ఎయిర్ స్ట్రిప్ నిర్మించారు. 1930లో భారత్ - చైనా యుద్ధ సమయంలో ప్రభుత్వ విమానాల హ్యాంగర్ గా దీన్ని వినియోగించారు. అప్పట్లో అతిపెద్ద రన్ వేగా గా కూడా ఈ విమానాశ్రయం గుర్తింపు పొందింది. ప్రస్తుతం దీనికి అదనంగా మరో 253 ఎకరాలు సేకరిసతున్నారు. విమానాశ్రయం నిర్మాణానికి 400 రూపాయల కోట్ల నుంచి 450 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భూమి మినహా మొత్తం కేంద్రమే భరిస్తుంది.