Harish Rao Comments on Telangana Congress: బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు మరో సారి కాంగ్రెస్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిని చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం మన రాజధాని హైదరాబాద్ పై జరుగుతున్న కుట్రను ఆపాలంటే ఎమ్మెల్సీ గా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలంటూ పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లాలో పర్యటించిన ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.  ఈ క్రమంలో హన్మకొండ హంటర్ రోడ్డులోని సీఎస్ఆర్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన వర్ధన్నపేట నియోజకవర్గం పట్టభద్రుల ఉప ఎన్నిక సన్నాహక సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బిట్స్ పిలానిలో గోల్డ్ మెడలిస్ట్ ఆయన రాకేష్ రెడ్డిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.


గోదావరి నీళ్లను ఒక్క చుక్క తీసుకోకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కొట్లాడామని తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వం గోదావరి నీళ్లు కాపాడే ప్రయత్నమే చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.  సీఎం కేసీఆర్ ఒక్కసారి కూడా జై తెలంగాణ అనలేదంటూ ఆరోపిస్తున్నారని హరీశ్ రావు అన్నారు.   


కాంగ్రెస్ హామీలన్నీ నీటిమూటలే
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్నీ నీటి మూటలే అన్నారు. ఎన్నికలకు ముందు  కాంగ్రెస్ ఆరు గ్యారంటీలంటూ ప్రచారం ఊదరగొట్టారని ఇప్పుడు తుస్సుమనించారంటూ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ప్రచారంలో ఆరు గ్యారంటీల్లో ఐదు అమలు చేసినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారని..  జాబ్ క్యాలెండర్ పత్తా లేకుండా పోయిందన్నారు. ఉపాధ్యాయుల మీద లాఠీ ఛార్జ్ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని హరీశ్ అన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించి మర్చిపోయారని ఆరోపించారు. మన తెలంగాణాలో దొడ్డు బియ్యం ఎక్కువగా పండిస్తామని... సన్న బియ్యానికే మద్దతు ధర ఇస్తామంటున్నారు.. మరి దొడ్డు బియ్యం పండించిన రైతుల పరిస్థితి  ఏంటని ప్రశ్నించారు.  గతంలో కేసీఆర్ సర్కార్ ఉద్యోగుల జీతాలు పెంచిందని, మహిళా గ్రాడ్యుయే‌ట్లు కూడా బీఆర్ఎస్‌కు మద్దతు ఇస్తున్నారని తెలిపారు. మహాలక్ష్మీ పథకం కింద వారికి నెలకు రూ. 2,500 ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందన్నారు.  


ఉప ముఖ్య మంత్రి బట్టి విక్రమార్క నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పలేందంటూ మాటదాటేస్తున్నారని ఆరోపించారు.  ఎన్నికలు అయిపోయాయి ఇక రేట్లు పెంచడం పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.    భూముల రేట్లు.. కరెంటు రేట్లు పెంచుతారట.. ఇస్తా అన్న హామీలకు తూట్లు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు. జనాలను మోసం మోసం చేసిన కాంగ్రెస్ ను ఓడగొట్టడంతోనే మార్పు మొదలవుతుందన్నారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నికకు ఈనెల 27న పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది.


ఈ నియోజకవర్గంలో 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఈ నియోజకవర్గంలో 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. అయితే.. వారిలో 2,87,007 మంది పురుషులు, 1,74,794 మంది మహిళలు, మరో ఐదుగురు ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. జూన్ 5న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా  నల్గొండ జిల్లా కలెక్టర్‌ను  ఎన్నికల సంఘం నియమించింది.