Hanumakonda Crime News: హనుమకొండలో దారుణం జరిగింది. నర్సింగ్ కాలేజీలో ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ దాడి చేశారు. ప్రస్తుతం ఆ యువతి ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.    

Continues below advertisement

హనుమకొండలోని ఓ నర్సింగ్ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న ఓ యువతిపై యాసిడ్ దాడి జరిగింది.  కాజీపేట కడిపికొండ బ్రిడ్జిపై గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ఎంజీఎం ఆస్పత్రిలో చేర్చారు. ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాధితురాలిది జనగాం జిల్లా జఫర్ ఘడ్ మండలం అని తెలుస్తోంది. కాజీపేట ఏసీపీ, పోలీసులు ఎంజీఎం ఆస్పత్రిలో బాధితురాలితో మాట్లాడి విచారణ చేస్తున్నారు

Continues below advertisement