Vijayashanthi Comments :    టీఆర్ఎస్ నేతలు ఏ భాషలో విమర్శలు చేస్తారో బీజేపీ నేతలు అదే భాషలో సమాధానం చెబుతారని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి స్పష్టం చేశారు. ధర్మపురి అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని విజయశాంతి తీవ్రంగా ఖండించారు.   అరవింద్ ఇంటిపై దాడి జరగడం దురదృష్టకరమన్నారు.  కేసీఆర్ బుద్ది వంకరని..  కేసీఆర్ తన బిడ్డలకైనా మంచి బుద్ది ఇచ్చి ఉంటే బాగుండునన్నారు.  కవిత వీదిరౌడీల్లాగా మాట్లాడుతోందని మండిపడ్డారు. నువ్వు, నీ కుటుంబం ఒళ్ళు, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని కేసీఆర్‌కు హెచ్చరిక జారీ చేశారు.  మీరు ఏ భాష వాడారో, బీజేపీ అదే భాష మాట్లాడుతుందన్నారు. ఇలాంటి దాడులు చూస్తూ సహించబోమని..  ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు విమర్శలు చేస్తే వాటికి సమాధానం చెప్పాలి కానీ దాడులు ఎంటి? కొట్టి చంపుతామని మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు.  మా ఎంపీ వ్యాఖ్యలకు మీ కూతురు కౌంటర్ ఇచ్చి ఉంటే సరిపోయేదన్నారు. 


దాడి ఘటనపై పార్టీ నేతలతో కలిసి ధర్మపురి అర్వింద్ ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను విజయశాంతి పరామర్శించారు. 





అంతకు ముందు టీఆర్ఎస్ నేతలపై బీజేపీలో తనకు ప్రాధాన్యం దక్కడం లేదని.. ఆ పార్టీలో ఉండనంటూ ప్రచారం చేస్తున్నారని  సోషల్ మీడియాలో విజయశాంతి మండిపడ్డారు. తనకు తెలంగాణ బీజేపీ నాయకత్వంతో సమస్యలు ఉన్నట్టు టీఆరెస్ సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారం ఒక తీవ్రమైన కుట్రన్నారు.  ఒకవేళ అదే నిజమని ఎవరైనా భావిస్తున్నట్లయితే వారు ఒక నిజం తెలుసుకోవాలన్నారు. తాను పనిచేసుకోవడానికి తెలంగాణతో పాటు నా బీజేపీలోనే అనేక దక్షిణాది, మరికొన్ని ఇతర రాష్ట్రాలు ఉన్నాయి. బీజేపీ నుండి వీడిపోవాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర బీజేపీతో దూరం వెళ్లిపోవాల్సినంత భేదాభిప్రాయాలు నాకేమీ లేవని స్పష్టం చేశారు. 



ఇటీవల బీజేపీ నేతలు విజయశాంతిని పెద్దగా కార్యక్రమాలకు పిలువడం లేదన్న ప్రచారం జరుగుతోంది. తనను ఎందుకు పిలవడం లేదో బండి సంజయ్‌నే అడగాలని ఓ సారి విజయశాంతినే మీడియా ఎదుట వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆ ప్రచారం అంతా టీఆర్ఎస్సే చేయిస్తోందని విమర్శలు గుప్పించారు.మొదట తల్లి తెలంగాణ పార్టీ పెట్టి రాజకీయాలు చేసిన విజయశాంతి తర్వాత తన పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేశారు. ఆ పార్టీ తరపున మెదక్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. మెదక్ అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఆ పార్టీలో ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఇచ్చినప్పటికీ.. బీజేపీలో చేరారు. ఇప్పుడు ఆ పార్టీలో పెద్దగా కార్యకలాపాలేమీ ఉండటం లేదు. 


అక్క రెడీ అనగానే తమ్ముళ్లు దాడి, ప్రాణాలు పోతే మీ అయ్య ఇస్తాడా? - బండి సంజయ్