హైదరాబాద్​: ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై ప్రపంచం మొత్తం విశ్వాసం, నమ్మకాన్ని వ్యక్తం చేస్తుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్​ రెడ్డి (Kishan Reddy) అన్నారు. 11ఏళ్ల పాలనలో ఒక్కరూపాయి అవినీతి లేకుండా కొనసాగించారన్నారు. యూపీఏ హయాం అంతా కుంభకోణాల మయమే అని ఆరోపించారు. జీరో టాలరెన్స్​ విధానంతో నీతివంతమైన పాలనను ప్రధాని మోదీ దేశానికి  అందించారన్నారు. ఆదివారం నాంపల్లిలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పదాదికారుల సమావేశం అనంతరం మాట్లాడుతూ.. మోదీ పదకొండేళ్ల పాలనపై వివరాలను ప్రతీ ఇంటికి, గ్రామాలలోని ప్రజలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు.

ఉగ్రవాద నెట్​ వర్క్​ ధ్వంసం..కాంగ్రెస్​ హయాంలో కేంద్రం 32 శాతం నిధులను ఇచ్చేవారు. ప్రస్తుతం 42 శాతానికి పెంచి రాష్ట్రాలు ఆర్థిక పరిపుష్టిని సాధించాలని విశ్వాసం, నమ్మకం, కమిట్మెంట్​ కొనసాగిస్తున్నామన్నారు. జీఎస్టీ ద్వారా అవినీతి లేకుండా సమర్థవంతమైన పన్నుల విధానాన్ని రూపొందించారు. దేశంలో హైదరాబాద్​ తో సహా ఉగ్రవాద దాడులు జరిగేవన్నారు. గత 11 ఏళ్లలో ఒక్క ఉగ్రవాద దాడి జరగకుండా కాపాడారన్నారు. మోదీ నేతృత్వంలో పాక్​ ఐఎస్​ ఐ నెట్​ వర్క్​ ను ధ్వంసం చేసిన తీరును చూస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్​ర్టానికి ఎన్ని నిధులు కేటాయించామో  చెప్పుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పఠాన్​ కోట్​ లో సర్టికల్​ స్ర్టైక్​, ఎయిర్​ స్ర్టైక్​, మూడోసారి ఆపరేషన్​ సిందూర్​ పేరుతో పాక్​ లోకి చొచ్చుకెళ్లామన్నారు. కాంగ్రెస్​ హయాంలో ఉగ్రదాడుల్లో పౌరులు, సైనికులు 42వేల మంది మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏకకాలంలో తెలంగాణలో 40 రైల్వే స్టేషన్ల ఆధునీకీకరణ..యూపీఐ హయాంలో హైదరాబాద్​ గోకుల్​ చాట్​, లుంబినీ పార్కు, దిల్​ సుఖ్​ నగర్​, దేశంలోని వందలాది ఉగ్రదాడులు జరిగేవన్నారు. మోదీ ప్రభుత్వం వచ్చాక ప్రతిస్పందనగా ఉగ్రవాదులను మట్టుబెట్టి, స్థావరాలను ధ్వంసం చేశామన్నారు. ఒక్కరిని చంపితే వందమందిని చంపుతామని గట్టి సందేశాన్ని ఇచ్చామన్నారు. దేశంలో నూతన రైళ్లు, 1300 రైల్వే స్టేషన్లు ఏకకాలంలో ఆధునీకరిస్తున్న ఘనత బీజేపీ, ఎన్డీయే, ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు. తెలంగాణలో కూడా బీజేపీని విమర్శిస్తున్న వారు 40 స్టేషన్లు ఏకకాలంలో ఆధునీకరిస్తున్నామని తెలుసుకోవాలని చెప్పారు. ఇందిరాపార్కులో కాంగ్రెస్​ హయాంలో నాచారం, కూకట్​ పల్లి, పఠాన్​ చెరువు ఇండస్ర్టీయల్​ ఎస్టేట్​ లో పారిశ్రామిక వేత్తలు వచ్చి ధర్నాలు చేసేవారన్నారు. ఏ ఒక్క రంగానికి విద్యుత్​ కొరత లేకుండా మోదీ ఆవిష్కృతం చేశారని కిషన్​ రెడ్డి చెప్పారు. 

మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు..ఎరువుల కోసం క్యూలో ఉన్న చరిత్ర కాంగ్రెస్​ పార్టీ హయాంలో ఉండేదన్నారు. ప్రస్తుతం ఎరువుల కొరత లేదన్నారు. ఒక్క రూపాయి పెంచకుండా, లక్షలాది రూపాయల సబ్సిడీ ఇచ్చేవారిమన్నారు. మోదీని, బీజేపీని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. వారణాసి, ఉజ్జయినీ మహాంకాళీ దేవాలయాలను అభివృద్ధి చేసిన ఘనత మోదీదే అన్నారు. కాంగ్రెస్​ 370, ఐఎస్​ఐ లాంటివి శాపాలేనన్నారు. వారి చేతగాని తనంతో దేశం ఉగ్ర కార్యకలాపాలను భరిస్తోందన్నారు. నిరుపేదలకు ఐదు కేజీల బియ్యం ఇస్తున్నారని చెప్పారు. ఐటీ సెక్టార్​, మహిళలకు 33 శాతం రిజర్వేషన్​, తొలిసారి బీసీ జనాభా సేకరణ చేయాలని చెప్పిందే బీజేపీ అన్నారు. ఏ రోజు మహిళల కోసం రిజర్వేషన్లను కల్పించలేదన్నారు. మోదీ ప్రభుత్వం మహిళల పక్షపాత ప్రభుత్వమన్నారు. అనేక సంస్కరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. రాహుల్​ గాంధీకి దేశ భవిష్యత్​, వాస్తవ పరిస్థితులు తెలియదన్నారు. ఎవ్వరో రాసిన స్పీచ్​ ను చదివి వినిపిస్తారని కిషన్​ రెడ్డి విమర్శించారు. 

రక్షణ రంగంలో దిగుమతి నుంచి ఎగుమతి స్థాయికి..పేదప్రజలకు బియ్యం, గ్యాస్​ సిలీండర్​, గృహాలు, నీరు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, ఆయుష్మాన్​ భారత్​, 70ఏళ్లు దాటిన వారికి కూడా వైద్యం అందే ఏర్పాటు చేశారన్నారు. గతపదేళ్లుగా 4 కోట్ల నిగృహాలు నిర్మించామని చెప్పారు. బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు, కరోనా సమయంలో సమర్థవంతంగా పరిస్థితులను ఎదుర్కోవడం, డిజిటల్​ లావాదేవీల్లో నెంబర్​ 1గా ఎదగడం, 98 శాతం సెల్​ ఫోన్ల దిగుమతి నుంచి ప్రస్తుతం చైనాను దాటి అమెరికా లాంటి దేశానికి ఐఫోన్​ లుఎగుమతి చేసే దేశంగా భారత్​ నిలిచిందన్నారు. వ్యవసాయ రంగంలో డ్రోన్లు, ఎంఎస్​ పీ ధరలు పెంచామన్నారు. రక్షణ రంగంలో దిగుమతి నుంచి ఎగుమతుల స్థాయికి ఎదిగామన్నారు. మేక్​ ఇన్​ ఇండియా ద్వారా పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన బుల్లెట్​ ప్రూఫ్​ జాకెట్లు 53 దేశాలకు ఎగుమతులు చేస్తున్నామని కిషన్​ రెడ్డి చెప్పారు. 

సంక్షోభంలోకి నెట్టిన బీఆర్​ఎస్​, కాంగ్రెస్​..అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతున్నామని, విజనరీ ఉన్న నాయకుడు తన దేశం కూడా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో, ఆలోచనతో 2047 విజన్​ ను రూపొందించారని చెప్పారు. ప్రతీఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలన్నారు. రైతు, కార్మికుడు, ఉద్యోగస్థుడు తమ తమ రంగాలలో, వృత్తులలో తమ ఏజెండాలలో 2047 వరకు ఎదగాలన్నారు. లక్ష్యంతో ముందుకు నడవాలన్నారు. 11 ఏళ్లలో మోదీ చేసిన పనులను దేశ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ లు ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేశాయన్నారు. సింగరేణికి 42 వేల కోట్లు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాలని, బ్యాంకులు, సంస్థలకు రూ. 10 లక్షల కోట్ల అప్పు ఉందన్నారు. బీఆర్​ఎస్​ అప్పు చేస్తే తామేం తక్కువ తిన్నామా? అని కాంగ్రెస్​ కూడా అప్పు చేసిందన్నారు. రాష్ర్టాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారన్నారు. మాటలు కోటలు దాటుతున్నాయే తప్ప తెలంగాణలో డబుల్​ ఇంజన్​ సర్కార్​ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని కిషన్​ రెడ్డి స్పష్టం చేశారు.

ఆరు గ్యారంటీల అమలేది..1200 నుంచి 1500మంది తెలంగాణ బిడ్డలు ఆత్మబలిదానాలు చేస్తే వారి త్యాగాల సమాధులపై బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ లు దోచుకుతింటున్నాయని కిషన్​ రెడ్డి మండిపడ్డారు. బీఆర్​ ఎస్​ హయాంలో అవినీతి కేంద్రీకృతంగా ఉంటే, కాంగ్రెస్​ హయాంలో అవినీతి వికేంద్రీకరమైందన్నారు. ఇద్దరూ కలిసి రాష్​ర్టాన్ని అధోగతి పాలు చేశారని అన్నారు. ఇతర రాష్ర్టాల్లో ఎన్నికలు జరిగితే తెలంగాణ ప్రజల డబ్బులను ఇచ్చేవారని ఆరోపించారు. కాంగ్రెస్​ పార్టీ కూడా తెలంగాణ డబ్బులను ఇతర రాష్ర్టాలకు ఇస్తుందన్నారు. ఏ వ్యాపారస్థుడు, బిల్డర్​ను, కాంట్రాక్టర్​ ను అడిగినా కమీషన్లు, వాటాలు తప్ప ఏమీ లేదని చెబుతున్నారని అన్నారు. కాంగ్రెస్​ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 సబ్​ గ్యారంటీలు అమలెక్కడా అని నిలదీశారు. తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ర్టాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధిపై చిత్తశుద్ధితో వ్యవహరించే పార్టీ తమదన్నారు.

రానున్న రోజుల్లో ఈ రాష్ర్టాన్ని రక్షించే పరిస్థితి ఈ కుటుంబ పార్టీకి, అవినీతి పార్టీకి లేదన్నారు. విశ్వాసంతో ముందుకు వెళ్లాలని అన్నారు. 77 లక్షల మంది ప్రజలు మనకు ఓటువేస్తారని అనుకోలేదని, ఇంకా కొద్దిగా కష్టపడితే 13 స్థానాలు దక్కేవన్నారు. రానున్న సమయంలో ప్రజలకు ధైర్యం కల్పించే విధంగా, కేంద్రం సాధించిన విజయాలను చెబుతూ,సమస్యలప గళమెత్తుతు ముందుకు వెళితే బీజేపీ అధికారంలో రావడాన్ని ఎవ్వరూ ఆపలేరన్నారు. ఎవరో వస్తారని,ఎవరో చేస్తారనే భావనను వదిలివేయాలని, ప్రతీ బీజేపీ కార్యకర్త కష్టపడి పనిచేయాలని అన్నారు.

తెలంగాణ రాష్​ర్టంలో రాజకీయ, కుటుంబ డ్రామాలు నడుస్తున్నాయన్నారు. వీరి డ్రామాలతో తెలంగాణ ప్రజలు పాత్రధారులు, సూత్రధారులు కానవసరం లేదన్నారు. ఆస్తులు, అంతస్థులు, పదవుల గొడవల్లో పడవద్దన్నారు. ఈ రెండు పార్టీల అవినీతి, అక్రమాలను బయటపెట్టాలన్నారు. కాంగ్రెస్​ విధానాలపై అప్రమత్తంగా ఉంటూ ఐక్యమత్యంతో, కలిసి కట్టుగా పనిచేస్తూ భవిష్యత్​ లో మోదీ ప్రభుత్వాన్ని తెలంగాణలో అధికారంలోకి తీసుకువద్దామని చెప్పారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. 

ఒకటే జెండా, ఏజెండాగా ముందుకు..ప్రధాని స్ఫూర్తితో, సందేశంతో కలిసి మెలిసి అందరం ఒకటే జెండా, ఏజెండాగా ముందుకు వెళ్లాలన్న విషయాన్ని పునరుద్ఘాటించారు. 5వ తేదీన పర్యావరణ దినోత్సవాన్ని కూడా విజయవంతం చేయాలన్నారు. యోగా దినోత్సవాన్ని కూడా పెద్ద ఎత్తున 20వ తేదీన ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్నారని చెప్పారు. అన్ని మండలాలు, జిల్లాలో పదేళ్ల యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు. 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సుపరిపాలన కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పారు. జిల్లా, మండల అధ్యక్షుల చేత నిర్వహించే ఈ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతీ ఒకరూ కృషి చేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.