కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలో ఆయన ఢిల్లీలో ఉండగా, కుటుంబ సభ్యులు వెంటనే కిషన్ రెడ్డిని ఆదివారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తీసుకొని వెళ్లారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఎయిమ్స్‌కు వెళ్లారు. అయితే, ఆయనకు గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నట్లుగా డాక్టర్లు గుర్తించారు. కార్డియోన్యూరో సెంటర్‌లోని కార్డిక్ కేర్ యూనిట్‌లో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయనకు గ్యాస్ట్రిక్ సమస్యే ఉన్నట్లుగా డాక్టర్లు తేల్చి చెప్పారు. చికిత్స తర్వాత సోమవారం ఉదయం ఆయన్ని డిశ్చార్జి చేస్తారని తెలుస్తోంది.
G Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి స్వల్ప అస్వస్థత! ఎయిమ్స్‌కి తరలింపు
ABP Desam | 01 May 2023 08:14 AM (IST)
ఆయనకు గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నట్లుగా డాక్టర్లు గుర్తించారు. కార్డియోన్యూరో సెంటర్‌లోని కార్డిక్ కేర్ యూనిట్‌లో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
జి.కిషన్ రెడ్డి (ఫైల్ ఫోటో)