Two more Naxalite leaders surrender before Telangana DGP:   తెలంగాణ డీజీపీ ముందు  మావోయిస్టు కీలక నేతలుప్రసాదరావు అలియాస్‌ చంద్రన్న,   రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాశ్‌ సరెండర్ అయ్యారు.  మావోయిస్టు లొంగుబాటులో తెలంగాణ SIB కీలక ఆపరేషన్‌ నిర్వహిస్తోంది.  సీఎం రేవంత్‌ రెడ్డి పిలుపు మేరకు చంద్రన్న అజ్ఞాతం వీడారు. జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకున్నారు. చంద్రన్న కేంద్ర కమిటీలో కీలక సభ్యుడిగా పనిచేశారు. 

Continues below advertisement

సీఎం రేవంత్ పిలుపు మేరకు లొంగిపోయాము !

అనారోగ్య పరిస్థితులు.. ఆపరేషన్ కగార్ వల్ల తాము లొంగిపోయామని మావోయిస్టులు చెప్పారు. రేవంత్ సూచనాలతోనే జనజీవన స్రవంతిలోకి వస్తున్నామన్నారు. అయితే ఇది లొంగుబాటు కాదు.. రాబోయే రోజుల్లో ప్రజల కోసమే వస్తున్నామని స్పష్టం  చేశారు. తాము  ఎలాంటి డబ్బులు ఆశించడం లేదన్నారు. చాలా మంది చనిపోయారు.. మా సిద్ధాంతం మేరకు ముందుకెళ్తున్నామని చెప్పుకొచ్చారు. 

Continues below advertisement

మావోయిస్టు పార్టీలో చీలికలు

మావోయిస్టు పార్టీలో అంతర్గత చీలికలు జరిగాయని సరెండర్ నక్సలైట్లు తెలిపారు. దేవోజి సీపీఐ మావోయిస్టు కార్యదర్శిగా ఉన్నారు.. ఎవరి మార్గం వాళ్ళు ఎంచుకున్నారు.. మేము ఎంచుకున్నామని బండి ప్రకాష్, చంద్రన్న తెలిపారు. సోని  వర్గం మమ్మల్ని వ్యతిరేకేస్తోందని.. మాకు కూడ ప్రజాల మధ్య పనిచేసే క్యాడర్ ఉంది.. దేశమంతా పనిచెయ్యడానికి ఉందని తెలిపారు. ఇప్పటివరకు ఉద్యమంలో పీడిత ప్రజల కోసమే పని చేశామని , భవిష్యత్తులో కూడా ప్రజల కోసమే పని చేస్తామని తెలిపారు. మా సిద్ధాంతం ఓడిపోలేదు, ఓడించడం ఎవరితరం కాదని వారు తెలిపారు. మా భావాజాలంతో భవిష్యత్తులో మరింత మంది ముందుకు వచ్చే అవకాశం ఉందని.. ప్రజల మధ్య ఉండి సేవ చేయాలనుకున్నామన్నారు. ఆయుధాలను పార్టీకి ఇచ్చి వచ్చామని తెలిపారు.    అందరూ సరెండర్ కావాలని డీజీపీ పిలుపు చంద్రన్నా, బండి ప్రకాశ్ అజ్ఞాతం వీడారని.. తెలంగాణ ప్రభుత్వం పిలుపు మేరకు అజ్ఞాతం నుండి బయటికి వచ్చి జనజీవన స్రవంతి లో కలిశారని డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. పుల్లూరి ప్రసాద్ రావ్ @ చంద్రన్నా ది పెద్దపల్లి మండలం  , 15 ఏళ్ల కేంద్ర కమిటీ సభ్యుడి గా ఉన్నాడు. మొదట రాడికల్ స్టూడెంట్ గా తన ప్రస్థానాన్ని స్టార్ట్ చేశాడు . 1980 లో కిషన్ జీ కి కొరియర్ గా చేశాడు. 2008 లోనే కేంద్ర కమిటీ మెంబర్ గా చంద్రన్న ఉన్నాడు. 2024 డిసెంబర్ వరకు తెలంగాణ స్టేట్ కమిటీ   సెక్రటరీ గా ఉన్నాడని డీజీపీ తెలిపారు. అక్టోబర్ 21 నాడు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు చంద్రన్న జన జీవన స్రవంతి లో కలిశాడని..  చంద్రన్నా ఆరోగ్యం కూడా సహకరించకాపోవడం తో అజ్ఞాతం వీడారన్నారు.