Best Diesel Cars Under 12 Lakhs: మీ మొదటి కారు కొనబోతున్నారా?, మీ బడ్జెట్‌ ₹12 లక్షల లోపేనా?. అయితే మీరు తీసుకునే నిర్ణయం చాలా స్మార్ట్‌గా ఉండాలి. ఎందుకంటే ఇది “మొదటి కారు” కాబట్టి... బిల్డ్‌ క్వాలిటీ, కంఫర్ట్‌, ఫీచర్స్‌ & మైలేజ్‌ అన్నీ బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. వీటన్నింటికీ సరిపోయేలా మీరు డీజిల్‌ ఇంజిన్‌ కోరుకుంటే, ₹12 లక్షల రేంజ్‌లో ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బెస్ట్‌ ఆప్షన్ల గురించి అర్ధం చేసుకుందాం.

Continues below advertisement

1. Tata Altroz Diesel - స్ట్రాంగ్‌ బిల్డ్‌ & సాలిడ్‌ మైలేజ్‌

టాటా ఆల్ట్రోజ్‌ అంటే బిల్డ్‌ క్వాలిటీకి పేరుంది. గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌ (GNCAP) క్రాష్‌ టెస్టుల్లో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ రావడం దీని బలం. ఈ కారులోని 1.5 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ సుమారు 90 bhp పవర్‌ ఇస్తుంది, మైలేజ్‌ దాదాపు 23 కి.మీ./లీటర్‌ వరకు వస్తుంది.

Continues below advertisement

ఫీచర్స్‌ విషయానికి వస్తే - టచ్‌స్క్రీన్‌, ఆటో హెడ్‌ల్యాంప్స్‌, రియర్‌ కెమెరా, ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.

దీని టాప్‌ వేరియంట్‌ కూడా ₹12 లక్షల లోపే (ఆన్‌-రోడ్‌ ధర) లభిస్తుంది. ఐదుగురు ప్రయాణీకులు సౌకర్యంగా కూర్చోవచ్చు, లాంగ్‌ డ్రైవ్స్‌కి కూడా కంఫర్ట్‌గా ఉంటుంది.

2. Mahindra XUV 3XO Diesel - పంచ్‌ ఉన్న పెర్ఫార్మెన్స్‌

మహీంద్రా XUV 3XO డీజిల్‌ వెర్షన్‌ మరో మంచి ఆప్షన్‌. 1.5 లీటర్‌ ఇంజిన్‌ 115 bhp పవర్‌, 300 Nm టార్క్‌ ఇస్తుంది. అంటే, హైవే మీద లేదా ఎత్తుగా ఉన్న రోడ్లలో డ్రైవ్‌ చేసేటప్పుడు అస్సలు స్ట్రగుల్‌ కాదు.

ఎంట్రీ లేదా మిడ్‌ వేరియంట్లు ₹12 లక్షల్లో (ఆన్‌-రోడ్‌ ధర) వస్తాయి. సేఫ్టీ పరంగా బలంగా ఉండి, సస్పెన్షన్‌ సాఫ్ట్‌గా ఉంటుంది కాబట్టి రోడ్‌ కంఫర్ట్‌ బాగుంటుంది.

ఒక్క లోపం ఏమిటంటే - హయ్యర్‌ వేరియంట్లలో లభించే అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు ఈ రేంజ్‌లో దొరకవు. కానీ ఇంజిన్‌ & డ్రైవ్‌ అనుభవం మాత్రం పర్ఫెక్ట్‌.

3. Kia Syros Diesel - ఫీచర్స్‌తో ఫ్రెష్‌ SUV స్టైల్‌

కొత్తగా వచ్చిన కియా సైరోస్‌ డీజిల్‌ కూడా బలమైన కాంపిటేటర్‌. బేస్‌ వేరియంట్‌ ₹12 లక్షల (ఆన్‌-రోడ్‌ ధర) లోపే దొరుకుతుంది.

SUV లుక్‌, బాడీ స్ట్రెంగ్త్‌ బాగుంటాయి. ఇంజిన్‌ స్మూత్‌గా స్పందిస్తుంది, ఫీచర్స్‌లో టచ్‌స్క్రీన్‌, రియర్‌ కెమెరా, స్టీరింగ్‌ మౌంటెడ్‌ కంట్రోల్స్‌, కనెక్టెడ్‌ కార్‌ టెక్నాలజీ వంటి సౌకర్యాలు ఉన్నాయి.

మైలేజ్‌ సుమారు 20–21 కి.మీ./లీటర్‌. సిటీ యూజ్‌, వీకెండ్‌ డ్రైవ్స్‌, లాంగ్‌ ట్రిప్స్‌.. ఇలా అన్ని మిక్స్‌ యూజ్‌లకు బాగా సరిపోతుంది.

ఏ కారు కొనాలి?

మీరు బిల్డ్‌ క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తే - Tata Altroz Diesel స్మార్ట్‌ ఆప్షన్‌.

పెర్ఫార్మెన్స్‌ & టార్క్‌ కావాలంటే - Mahindra XUV 3XO Diesel బెటర్‌.

మోడర్న్‌ SUV లుక్‌ & ఫీచర్స్‌ కావాలంటే - Kia Syros Diesel ని ఎంచుకోండి.

₹12 లక్షలలో ఈ మూడు కార్లలో ఏది తీసుకున్నా “ఫీచర్స్‌, కంఫర్ట్‌, మైలేజ్‌” అన్నీ దొరుకుతాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.