Manoj Bajpayee's The Family Man Season 3 Web Series OTT Release Date  Locked: స్పై, హారర్, థ్రిల్లర్ కంటెంట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లాంగ్వేజ్ ఏదైనా ఆడియన్స్ అలాంటి మూవీస్, సిరీస్‌లు అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతుంటారు. అలా ఆడియన్స్‌ను విశేషంగా ఎంటర్టైన్ చేసిన వెబ్ సిరీస్ అంటే మనకు ఠక్కున గుర్తొచ్చేది 'ది ఫ్యామిలీ మ్యాన్'. బాలీవుడ్ స్టార్ మనోజ్ భాజ్‌పాయ్ కీలక పాత్ర పోషించిన ఈ సిరీస్‌ను రాజ్ అండ్ డీకే రూపొందించారు. ఇప్పటికే 2 సిరీస్‌లు పూర్తి కాగా మూడో సీజన్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Continues below advertisement

సీజన్ 3 స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఇప్పటికే రిలీజ్ అయిన స్పెషల్ వీడియోస్ భారీ హైప్ క్రియేట్ చేయగా... తాజాగా ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసింది. నవంబర్ 21 నుంచి సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ఓ స్పెషల్ వీడియో షేర్ చేశారు మేకర్స్. 'థ్రెట్ అనాలసిస్ అండ్ సర్వైవలెన్స్ సెల్ (TASK) సీనియర్ ఆఫీరస్ శ్రీకాంత్ తివారీగా మరోసారి అలరించడానికి మనోజ్ బాజ్ పాయ్ మన ముందుకు రానున్నారు.' అంటూ రాసుకొచ్చారు. పాకిస్థాన్, శ్రీలంకలో టెర్రరిజం బ్యాక్ డ్రాప్‌లో ఫస్ట్ 2 సీజన్స్ రూపొందించగా... కొత్త సీజన్‌లో చైనాతో పొంచి ఉన్న ప్రమాదం బ్యాక్‌డ్రాప్‌గా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

Continues below advertisement

'ఈ సిరీస్‌లో ఆఫీసర్ శ్రీకాంత్, అతని టీం ఎదుర్కొనే వ్యక్తులు మరింత డేంజరస్‌గా ఉంటారు. అదే టైంలో శ్రీకాంత్ ఫ్యామిలీ డ్రామా కూడా సరికొత్తగా ఉంటుంది. కొత్త వారి నుంచి అతని ఫ్యామిలీకి సవాళ్లు ఎదురవుతాయి.' అంటూ గతంలో డైరెక్టర్ తెలిపారు. ప్రస్తుతం సిరీస్‌పై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. తెలుగు, తమిళ, హిందీతో పాటు ఇంగ్లీష్‌లోనూ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.

Also Read : 'ఫౌజీ'లో జూనియర్ ప్రభాస్ స్టార్ హీరో కుమారుడే! - ఇద్దరు కుమారులు ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చేశారుగా...

ఈ సిరీస్‌ను డీ2 ఫిల్మ్ బ్యానర్‌లో రాజ్ డీకే రూపొందించగా... మనోజ్ బాజ్‌పాయ్‌తో పాటు ప్రియమణి, జేకే తల్పాడే, అశ్లేష ఠాకూర్, శరద్ ఖేల్కర్, సందీప్ కిషన్, గుల్‌పనాగ్, శ్రేయా ధన్వంతరి, సన్నీ హిందూజా, అభయ్ వర్మలు కీలక పాత్రలు పోషించారు. 2019లో వచ్చిన ఫస్ట్ సీజన్, 2021లో వచ్చిన సెకండ్ సీజన్ ఎంతో ఆకట్టుకున్నాయి. రెండో సీజన్‌లో స్టార్ హీరోయిన్ సమంత విలన్ రోల్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక కొత్త సీజన్‌లో ఈశాన్య రాష్ట్రాలపై చైనా దాడులను ఎదుర్కొన్నారు? కొవిడ్ 19 వంటి అంశాలు చూపించనున్నట్లు తెలుస్తోంది. భారత్‌పై చైనా కుట్రలను ఆఫీసర్ శ్రీకాంత్ అండ్ టీం ఎలా ఎదుర్కొంది అనేది చూపించనున్నట్లు అర్థమవుతోంది. సీజన్ ఇక్కడితో ముగిస్తారా? లేక కొనసాగిస్తారా? అనేది కూడా తెలియాల్సి ఉంది.