టీఎస్ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వినూత్న ఆలోచనలతో సజ్జనార్ విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతున్నారు. బస్ స్టేషన్లలో యూపీఐ లావాదేవీలు అనుమతితో పేమెంట్స్ ఇష్యూస్ తగ్గించారు. తాజాగా న్యూ ఇయర్ కు గిఫ్ట్ ఇచ్చారు సజ్జనార్. పండపూట రేట్లు పెంచి ప్రయాణికుల జేబులకు చిల్లుపెట్టి ఖజానాలు నింపుకునేవి ఆర్టీసీలు. కానీ సజ్జనార్ ఇందుకు భిన్నంగా ఆలోచన చేస్తూ ఆర్టీసీని ప్రజల చెంతకు చేరుస్తున్నారు.    


Also Read: 2022కు న్యూజిలాండ్ ఘన స్వాగతం.. బాణసంచా కాల్పులు, కేరింతలు






12 ఏళ్ల పిల్లలకు ఫ్రీ సర్వీస్


అప్పుల్లో ఉన్న టీఎస్ఆర్టీసీని గాడిలో పెడుతున్న ఎండీ సజ్జనార్ మరో ఆలోచన చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పారు. 12 ఏళ్లలోపు పిల్లలందరికీ జనవరి 1న ఉచిత ప్రయాణం ఆఫర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. తల్లిదండ్రులు ఎవరో ఒకరు వారితో ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్సులో ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపారు.  


Also Read: ఆర్ఆర్ఆర్‌కూ ఏపీలో అవే టిక్కెట్ ధరలు.. ఏమీ తేల్చకుండానే కమిటీ తొలి భేటీ వాయిదా !


మందుబాబులకు ప్రత్యేక బస్సులు


కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొనే మందుబాబులకు ఓ గుడ్ న్యూస్ లాంటిదే ఇది. హాయిగా ఇంటికి వెళ్లొచ్చన్నమాట. అందుకోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. అయితే సిటీ శివారులో ఉన్న ఈవెంట్స్ జరిగే ప్రాంతాలకు బస్ సర్వీసులు ఉంటాయి. డిసెంబర్ 31న ఈవెంట్లకు వెళ్లేవారి కోసం రాత్రి 7.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు బస్సులు ఉంటాయి. మళ్లీ తిరుగు ప్రయాణం అర్ధరాత్రి 12.30 నుంచి తెల్లవారుజాము 3 గంటల వరకు టీఎస్ ఆర్టీసీ సేవలు అందించనుంది. 18 సీట్ల ఏసీ బస్సు వెళ్లి రావటానికి రూ.4 వేల ప్యాకేజీని టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. అయితే ఒకరికి రూ.100 వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ పేర్కొంది. ఆర్టీసి సూచించిన 15 ప్రాంతాల్లో మాత్రమే బస్సులు అందుబాటులో ఉంటాయి. మరోవైపు కొత్త సంవత్సరం కానుకగా జనవరి1వ తేదీన తల్లిదండ్రులతో ప్రయాణించే 12 ఏళ్ల లోపు పిల్లలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వివరాలు వెల్లడించారు. 


Also Read: తమిళ హీరోలు ప్రజల కోసం పోరాడతారు... తెలుగు హీరోలు తమ కోసం కూడా నోరెత్తలేరా ? .. టీడీపీ ఎమ్మెల్యే ఘాటు విమర్శలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి