Telangana Group 1 Notification: హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్ 1 నోటిఫికేషన్ పై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. గ్రూప్ 1 నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ (TSPSC) రద్దు చేసింది. గత ప్రభుత్వ హయాంలో 503 పోస్టులతో జారీ చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్‌ను సోమవారం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. పేపర్ లీక్ కావడంతో గ్రూప్ 1 నోటిఫికేషన్ (TSPSC Group 1 Notification) రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2022 ఏప్రిల్ లో 503 పోస్టులకు అప్పటి కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవల కొన్ని కొత్త పోస్టుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసింది.
రెండు సార్లు గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటివరకూ ఒక్కసారి కూడా గ్రూప్ 1 పోస్టులు భర్తీ కాలేదు. రెండు సార్లు నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ, భర్తీ ప్రక్రియ మాత్రం సజావుగా సాగలేదు. మొదట 2022 ఏప్రిల్ లో 503 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కానీ ప్రిలిమ్స్ నిర్వహణ జరిగి, ఫలితాలు సైతం విడుదలయ్యాయి. మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారని అంతా అనుకుంటున్న సమయంలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యిందని ఆరోపణలు రావడంతో మొదట ప్రిలిమ్స్ ఎగ్జామ్ రద్దు చేశారు. దాంతో గ్రూప్ 1 నోటిఫికేషన్ తొలిసారి రద్దయింది.
అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించింది. తొలిసారి ఎగ్జామ్ నిర్వహించిన సమయంలో బయోమెట్రిక్ లాంటి విషయాలతో పాటు ఎంతో జాగ్రత్తగా ఎగ్జామ్ నిర్వహించారు. కానీ రెండోసారి నిర్వహించిన ఎగ్జామ్ లలో అవకతవకలు జరిగాయని, నిబంధనలు సరిగ్గా పాటించలేదని గ్రూప్ 1 (Group 1) ప్రిలిమినరీ మరోసారి రద్దు చేసింది టీఎస్‌పీఎస్సీ. విషయం హైకోర్టు వరకు వెళ్లడంతో ఎగ్జామ్ రద్దు నిర్ణయాన్ని సమర్థించింది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించింది. కేసు విచారణలో ఉండగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
కొత్త ఛైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి
టీఎస్ పీఎస్సీ చైర్మన్, ముగ్గురు సభ్యులు సైతం రాజీనామా చేయగా కొత్త ఛైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించింది తెలంగాణ ప్రభుత్వం. గతంలో హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేసిన పిటిషన్‌ను టీఎస్ పీఎస్సీ సుప్రీంకోర్టులో వెనక్కి తీసుకుంది. కొత్తగా 60 పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గ్రూప్ 1 పాత నోటిఫికేషన్ రద్దు కావడంతో కొత్త పోస్టులతో కలిపి టీఎస్‌పీఎస్సీ త్వరలో మరో నోటిఫికేషన్ విడుదల చేయనుందని తెలుస్తోంది.
2022లో అక్టోబరు 16న తొలిసారి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించారు. తరువాత ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం వెలుగుచూడటంతో TSPSC ఆ పరీక్షను రద్దు చేసింది. తరువాత గత ఏడాది (2023) జూన్ 11న ప్రిలిమ్స్ నిర్వహించింది. టీఎస్‌పీఎస్సీ వీరి నుంచి 1:50 నిష్పత్తిలో 25 వేల మందిని ఈ ఏడాది జనవరిలో మెయిన్స్‌కు ఎంపిక చేసింది. జూన్‌లో ప్రధాన పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూలు సైతం విడుదల చేసింది. అనూహ్యంగా ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం వెలుగుచూడటంతో కమిషన్ ఆ పరీక్షను రద్దు చేసింది. తిరిగి జూన్ 11న ప్రిలిమ్స్ నిర్వహించగా 2,33,506 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షను కూడా హైకోర్టు గతంలోనే రద్దు చేసింది.