TS SSC Results: ఏప్రిల్ 10వ తేదీ బుధవారం రోజు పదో తరగతి ఫలితాలు విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. అయితే పదో తరగతి పేపర్ లీకేజీ కేసులో డీబార్ అయిన విద్యార్థి హరీష్ ఫలితాలను అధికారులు హోల్డ్ లో పెట్టారు. హన్మకొండ జిల్లాలోని కమలాపూర్ లో ఎంజేపీ విద్యార్థి దండెబోయిన హరీష్ పదో తరగతి చదువుతున్నాడు. హిందీ పరీక్ష పేపర్ ఇతని వద్ద నుంచి తీసుకునే ఫొటోలు తీసుకున్నారు నిందితులు. ఈ విషయం గుర్తించిన అధికారులు ఐదేళ్ల పాటు హరీష్ పరీక్షలు రాసేందుకు వీలు లేకుండా డీబార్ చేశారు. దీనిపై అతడి తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. విద్యాశాఖ అధికారులు విధించిన డీబార్ ను ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని పరీక్షలు రాసేందుకు అనుమతిని ఇచ్చింది. దీంతో హరీష్ పరీక్షా గతంలో ఉన్న హాల్ టికెట్ నెంబర్ తోనే పరీక్షలు కూడా రాశాడు. అయితే నిన్న విడుదల చేసిన ఫలితాల్లో హరీష్ రిజల్ట్ ను హోల్డ్ లో పెట్టారు. ఇదిలా ఉంటే విద్యార్థి హరీష్ రిజల్ట్ హోల్డ్ లో పెటట్డంతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఎన్ఎస్ యూఐ శాఖ నాయకులు కలిశారు. విద్యార్థి హరీష్ ఫలితాలను ప్రకటించాలని సబితా ఇంద్రారెడ్డికి వినతి పత్రం అందజేశారు.
నిన్ననే విడుదలైన పదో తరగతి ఫలితాలు..
- మరోవైపు తెలంగాణ టెన్త్ పరీక్షల్లో పాసైన శాతం-86.60 %
- తెలంగాణ టెన్త్ పరీక్షల్లో పాసైన బాలురు శాతం-84.68 %
- తెలంగాణ టెన్త్ పరీక్షల్లో పాసైన బాలికల శాతం- 88.53 %
- బాలురు కంటే బాలికల పాస్ పర్సంటేజ్ 3.85 శాతం ఎక్కువ
- తెలంగాణ టెన్త్ పరీక్షలకు హాజరైంది- 4,91,862
- తెలంగాణ టెన్త్ పరీక్షలకు హాజరైన బాలురు-243186
- తెలంగాణ టెన్త్ పరీక్షల్లో పాసైన బాలురు - 205930
- తెలంగాణ టెన్త్ పరీక్షలకు హాజరైన బాలికలు-2,41,184
- తెలంగాణ టెన్త్ పరీక్షల్లో పాసైన బాలికలు- 2,13,530
- తెలంగాణ టెన్త్ పరీక్షల్లో పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్న జిల్లా - నిర్మల్ జిల్లా (99%)
- తెలంగాణ టెన్త్ పరీక్షల్లో పాస్ పర్సంటేజ్ తక్కువ ఉన్న జిల్లా -వికారాబాద్(59.46)
- 2793 స్కూల్స్‌లో వందకు వంద శాతం ఫలితాలు
- 25 ప్రభుత్వం పాఠశాలల్లో జీరో ఫలితాలు
- తెలంగాణ టెన్త్ పరీక్షల్లో పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్న జిల్లా - నిర్మల్ జిల్లా
- తెలంగాణ టెన్త్ పరీక్షల్లో పాస్ పర్సంటేజ్ తక్కువ ఉన్న జిల్లా -వికారాబాద్
- తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి 13 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. పదోతరగతి పరీక్షలకు 7,39,493 మంది విద్యార్ధులు హాజరయ్యారు.
గతేడాది రిజల్ట్స్ చూస్తే...
గతేడాది తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో పెద్ద ఎత్తున ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఏకంగా 90 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. వీరిలో బాలుర ఉత్తీర్ణత శాతం 87.61 కాగా, బాలికల ఉత్తీర్ణత శాతం 92.45 గా ఉంది. జిల్లాల వారీగా చూస్తే సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో 97.87 శాతం ఉత్తీర్ణతతో తొలి స్థానంలో నిలిచింది. హైదరాబాద్ జిల్లా 79 శాతంతో చివరి స్థానంలో ఉండిపోయింది.